Asianet News TeluguAsianet News Telugu

మూడు రాజధానులు: అసెంబ్లీ ముట్టడి, గల్లా జయదేవ్ చొక్కాను చించిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్‌లో మూడు చోట్ల రాజధానిని ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడంతో ప్రతిపక్షాలు, రాజధాని రైతులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 

TDP MP Galla Jayadev Serious On Police Rude Behaviour at Chalo Assembly
Author
Amaravathi, First Published Jan 20, 2020, 2:24 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో మూడు చోట్ల రాజధానిని ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడంతో ప్రతిపక్షాలు, రాజధాని రైతులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ రైతులతో కలిసి అసెంబ్లీ కాంప్లెక్స్‌ను నాలుగువైపులా ముట్టడించారు.

దీంతో రైతులు, నేతలను పోలీసులు అడ్డుకుని లాఠీఛార్జీ చేశారు. ఒకదశలో ఎంపీ జయదేవ్‌పైనా పోలీసులు ప్రతాపం చూపించడంతో ఆయన చొక్కా చినిగిపోయింది. అంతకు ముందు పోలీసు వలయాన్ని ఛేదించుకుని అమరావతి రైతులు ఆంధ్రప్రదేశ్ సచివాలయం ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు.

Also Read:విశాఖలో నాకు ఒక్క ఎకరం ఉన్నట్టు నిరూపించాలి: మంత్రి బొత్స సవాల్,

పాలనా వికేంద్రీకరణ బిల్లుకు వ్యతిరేకంగా సోమవారం అమరావతి రైతులు చలో సెక్రటేరియట్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.సచివాలయాన్ని రైతులు నాలుగు వైపులా దిగ్బంధించారు.

తుళ్లూరు వైపు నుంచి పంట పొలాల్లోంచి.. సచివాలయ వెనుక గేటుకు రైతులు చేరుకున్నారు. మందడం, మల్కాపురం వైపు నుంచి సచివాలయం ముందు గేటుకు చేరుకున్నారు. శాఖమురు, ఐనవోలు,గ్రామాల నుండి సచివాలయం కుడిపక్క గేట్ వైపు వచ్చారు. సచివాలయ ముట్టడిని అడ్డుకోలేక పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Also Read:టీడీపీ నేతలు కొనుగోలు చేసిన భూములివే: అసెంబ్లీలో బయటపెట్టిన మంత్రి బుగ్గన

సచివాలయం వెనుక వైపు నుంచి వచ్చి రైతులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఆందోళనకి అనుమతి లేదంటూ పోలీసులు లాఠీచార్జీకి దిగారు. ఈ లాఠీ ఛార్జిలో  శంకర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి సృహ తప్పి పడిపోయాడు. లాఠీ చార్జీలో అతని కాలు కూడా విరిగింది.

పోలీసులను ఛేదించుకుని అసెంబ్లీ మెయిన్ గేట్ వద్దకు అమరావతి రైతులు చేరుకున్నారు. దాంతో సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. చోటు చేసుకుంది. రైతులు జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతి లోని సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios