Asianet News TeluguAsianet News Telugu

నా చొక్కా చింపారు.. ఎక్కడెక్కడో తిప్పారు: జైలు నుంచి విడుదలైన గల్లా వ్యాఖ్యలు

టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను వ్యతిరేకిస్తూ సోమవారం గల్లా అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్నారు.

TDP MP Galla Jayadev Released From Jail
Author
Guntur, First Published Jan 21, 2020, 3:50 PM IST

టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను వ్యతిరేకిస్తూ సోమవారం గల్లా అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్నారు. దీంతో ఆయనను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

ఒక దశలో పోలీసులు, జయదేవ్‌కు మధ్య పెనుగులాట జరిగి ఆయన చొక్కా సైతం చిరిగిపోయింది. అరెస్ట్ చేసిన వెంటనే జయదేవ్‌ను దుగ్గిరాల, పెదకాకాని, గుంటూరు మీదుగా నరసరావుపేట అక్కడి నుంచి రొంపిచర్ల స్టేషన్‌కు తరలించారు.

Also Read:గల్లా చేసిన తప్పేంటి..? ఇంత దారుణమా..? మండిపడ్డ చంద్రబాబు

అనంతరం మంగళగిరి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఆయన రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను మంగళవారం తెల్లవారుజామున గుంటూరు సబ్‌జైలుకు తరలించారు.

గల్లా జయదేవ్‌కు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఆయన తరపు న్యాయవాదులు దరఖాస్తు చేయగా.. రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తుపై మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో మంగళవారం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

Also Read:జగన్ ప్రభుత్వాన్ని కూల్చేదాకా నిద్రపోను, పతనం ప్రారంభం : పవన్ కళ్యాణ్

ఈ సందర్భంగా గల్లా జయదేవ్ మాట్లాడుతూ... మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. మహిళలు, వృద్ధులపైనా పోలీసులు లాఠీఛార్జీ చేశారని, దీంతో తాను అక్కడే బైఠాయించానన్నారు.

తనపైకి దూసుకువచ్చిన పోలీసులను మహిళలు, రైతులు అడ్డుకున్నారని జయదేవ్ తెలిపారు. సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో పక్కా ప్రణాళిక ప్రకారం దాడి చేస్తున్నారని తన పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. అరెస్ట్ తర్వాత కొన్ని గంటల పాటు తనను పోలీసుల వ్యాన్‌లో తిప్పారని ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుని పరిస్థితి ఏంటని జయదేవ్‌ ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios