మరికాసేపట్లో సీఎం రమేశ్ ‘ఉక్కు దీక్ష’

TDP MP CM Ramesh deeksha For Kadapa Steel Plant
Highlights

మరికాసేపట్లో సీఎం రమేశ్ ‘ఉక్కు దీక్ష’

కడప జిల్లాలో ఉక్కు కార్మగారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఇవాళ్టీ నుంచి ఆమరణ నిరాహారదీక్షకు దిగనున్నారు.. జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దీక్షకు ఉక్కు దీక్ష అని పేరు పెట్టిన టీడీపీ శ్రేణులు.. దీక్షా వేదిక వద్దకు భారీగా చేరుకున్నాయి. తన నివాసం నుంచి బయలుదేరిన సీఎం రమేశ్‌ వెంట వందలాది మంది కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు..

కడపలో స్టీల్ ప్లాంట్ సంగతి తేల్చాలంటూ ఇటీవల రమేశ్ ప్రధాని మోడీకి లేఖ రాశారు.. ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి మెకాన్ సంస్థ ఇచ్చిన సాధ్యాసాధ్యాల నివేదికను పరిశీలించాలని కూడా ఆయన కోరారు. ప్లాంట్‌ను ఏర్పాటు చేయని పక్షంలో ఆమరణ దీక్షకు దిగుతానని రమేశ్ హెచ్చరించారు. కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో దీక్షకు సిద్ధమయ్యారు.

loader