ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ ప్రజా ప్రతినిధుల దీక్షా భగ్నం

కడప: కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కోసం దీక్షలో ఉన్న ఎమ్మెల్సీ బీటెక్ రవి దీక్షను బుధవారం సాయంత్రం పోలీసులు భగ్నం చేశారు. బీటెక్ రవికి అత్యవసరంగా చికిత్స అందించాలని వైద్యులు సూచించారు.దీంతో ఆయనను వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సీఎం రమేష్ ఆరోగ్యం కూడ క్షీణించినట్టు వైద్యులు చెప్పారు. దీంతో ఆయనను కూడ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది.

కపడలో ఉక్కు ఫ్యాకర్టీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేది నుండి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు ఆమరణ నిరహార దీక్షకు దిగారు. ఇవాళ్టికి వీరిద్దరి దీక్ష 8వ రోజుకు చేరుకొంది. 

బుధవారం నాడు వైద్యులు పరీక్షించారు. బీటెక్ రవి పరిస్థితి ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు ప్రకటించారు. దీంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. 

దీంతో వైద్యులు దీక్షా శిబిరం నుండి బీటెక్ రవిని తొలుత అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత సీఎం రమేష్ ను కూడ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ తాను దీక్షను కొనసాగిస్తానని సీఎం రమేష్ ప్రకటించారు. కానీ, ఆయనను కూడ ఆసుపత్రికి తరలించే అావకాశం ఉంది.

దీక్షలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్సీకి వెంటనే వైద్యం అందించకపోతే ఆరోగ్యానికి ప్రమాదం ఉందని వైద్యులు సూచించారు.దీంతో పోలీసులు దీక్షను భగ్నం చేశారు. పోలీసులకు టీడీపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వావాదం చోటు చేసుకొంది.