కాపు రిజర్వేషన్: లోక్‌సభలో ప్రైవేట్ బిల్లు పెట్టిన ఆవంతి శ్రీనివాస్

TDP MP Avanthi Srinivas introduces private bill in Lok Sabha
Highlights

కాపుల రిజర్వేషన్ల అంశం మరోసారి లోక్‌సభలో ప్రస్తావించేందుకు టీడీపీ ప్లాన్ చేసింది. లోక్‌సభలో  టీడీపీ ఎంపీ ఆవంతి శ్రీనివాస్  కాపులకు రిజర్వేషన్లపై  ప్రైవేట్ మెంబర్ బిల్లును లోక్‌సభలో పెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత కాపుల రిజర్వేషన్ అంశంపై చర్చ జరిగే అవకాశం లేకపోలేదు.


న్యూఢిల్లీ: కాపుల రిజర్వేషన్ల అంశం మరోసారి లోక్‌సభలో ప్రస్తావించేందుకు టీడీపీ ప్లాన్ చేసింది. లోక్‌సభలో  టీడీపీ ఎంపీ ఆవంతి శ్రీనివాస్  కాపులకు రిజర్వేషన్లపై  ప్రైవేట్ మెంబర్ బిల్లును లోక్‌సభలో పెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత కాపుల రిజర్వేషన్ అంశంపై చర్చ జరిగే అవకాశం లేకపోలేదు.

కాపులకు రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్రం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.కానీ, ఈ విషయమై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ విషయమై  ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ విషయమై నిర్ణయం తీసుకోవాలని  టీడీపీ కోరుతోంది.

కాపుల రిజర్వేషన్ల విషయమై ఏపీలో ప్రస్తుతం  రాజకీయంగా  పార్టీల మధ్య  వాదనలు సాగుతున్నాయి. ఈ తరుణంలో పార్లమెంట్ వేదికను ఉపయోగించుకోవాలని టీడీపీ ప్లాన్ చేసింది. ఇందులో బాగంగా అనకాపల్లి ఎంపీ ఆవంతి శ్రీనివాస్ తో  ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు.  లోక్‌సభలో ఈ అంశం ఈ రోజు మధ్యాహ్నం తర్వాత చర్చకు వచ్చే అవకాశం ఉంది.

కాపులకు రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని టీడీపీ ఎంపీలు చెబుతున్నారు. కేంద్రం నిర్ణయం తీసుకొనే వరకు తమ ఆందోళన కొనసాగుతోందని టీడీపీ ఎంపీలు చెప్పారు.

loader