Asianet News TeluguAsianet News Telugu

టిడిపి ఎంఎల్సీ అరెస్టు..రిమాండ్

  • రుణాల కోసం బ్యాంకులను మోసం చేయటం, తీసుకున్న రుణాలను ఎగ్గొట్టటం లాంటి ఆరోపణలు ఇంకా పలువురు టిడిపి నేతలపై ఉన్నాయి.
Tdp mlc vakati sent for remand by cbi

టిడిపి ఎంఎల్సీ వాకాటి నారాయణరెడ్డిని సిబిఐ పోలీసులు రిమాండ్ కు తరలించారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో ఈనెల 21న వాకాటిని సిబిఐ అరెస్టు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. విఎన్ఆర్ ఇన్ ఫ్రా పేరుతో వాకాటికి ఓ నిర్మాణ సంస్ధ ఉంది. అవసరాల కోసం వాకాటి ఆర్ధిక సంస్ధలు, బ్యాంకుల నుండి సుమారు రూ. 190 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే, తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేదు. దాంతో ఆ మొత్తం పెరిగి రూ. 205 కోట్లయింది. రుణాల వసూళ్ళ కోసం బ్యాంకు, ఆర్ధిక సంస్ధలు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది.

దాంతో ఆర్దిక నేరాల క్రింద బ్యాంకు, ఆర్దిక సంస్ధలు ఫిర్యాదు చేయగా కేసు సిబిఐకి చేరింది. రంగంలోకి దిగిన సిబిఐ వాకాటిని కలవటానికి ప్రయత్నించింది. అయితే, ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో అరెస్టు వారెంటు జారీ చేసి గాలింపు మొదలుపెట్టింది. వాకాటి బెంగుళూరులో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్ళి  అరెస్టు చేసింది. విచారణ తర్వాత సిబిఐ వాకాటిని కోర్టులో ప్రవేశపెట్టగా బుధవారం రిమాండ్ కు పంపింది. మొత్తానికి రుణాల ఎగవేత, రుణాల కోసం ఆస్తుల విలువను పెంచి చూపించటం లాంటి అభియోగాలున్నాయి వాకాటిపై.

రుణాల కోసం బ్యాంకులను మోసం చేయటం, తీసుకున్న రుణాలను ఎగ్గొట్టటం లాంటి ఆరోపణలు ఇంకా పలువురు టిడిపి నేతలపై ఉన్నాయి. కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపి రాయపాటి సాంబశివరావు, మంత్రి గంటా శ్రీనివసరావు నెల్లూరు జిల్లా ఎంఎల్ఏ రామారావు, నెల్లూరు ఫిరాయింపు మేయర్ అబ్దుల్ మజీద్ తదితరులు కేసులను ఎదుర్కొంటున్నారు. ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్న వారిని టిడిపిలోనే పెట్టుకుని చంద్రబాబునాయుడు నీతి నిజాయితీ గురించి లెక్షర్లు ఇస్తుంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios