జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వెనుక అదృశ్యశక్తిగా బీజేపీ ఉందని వ్యాఖ్యానించారు. పవన్ ను నడిపిస్తోంది బీజేపీయేనంటూ ఆరోపించారు.  

నెల్లూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వెనుక అదృశ్యశక్తిగా బీజేపీ ఉందని వ్యాఖ్యానించారు. పవన్ ను నడిపిస్తోంది బీజేపీయేనంటూ ఆరోపించారు. 

నెల్లూరు జిల్లా కావాలిలో పర్యటించిన ఆయన తెలంగాణాలో టీడీపీని పక్కన పెట్టి ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకొని బీజేపీ చీకటి వ్యవహారాలు నడుపుతుందని మండిపడ్డారు. 
పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీలో మాయావతిని కలవటానికి వెళ్లినప్పుడు విమానాశ్రయంలో ఆయనను రిసీవ్‌ చేసుకుంది, వాహనం సమకూర్చింది అంతా బీజేపీయేనని చెప్పుకొచ్చారు. 

బీజేపి ఒకవైపు వైసీపీని మరోవైపు జనసేనను పెట్టుకొని టీడీపీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఆకుట్రను గమనించిన చంద్రబాబు బీజేపిని ఎదుర్కోనేందుకు దేశంలో అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రయత్నాలు చూసి మోదీకి వెన్నులో వణుకు పుడుతుందన్నారు.