ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. రాజధాని తరలింపు, వికేంద్రీకరణ బిల్లు, శాసనమండలి రద్దు వంటి అంశాల కారణంగా గత కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో హీట్ పెరిగిన సంగతి తెలిసిందే.

Also Read:రద్దుకే జగన్ నిర్ణయం: మండలి రద్దు, పునరుద్ధరణ చరిత్ర ఇదీ...

దీనిలో భాగంగా టీడీపీ-వైసీపీ శ్రేణులు, నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఉన్నారు. లోకేశ్ సైతం ట్విట్టర్‌ సాక్షిగా సీఎంపై మండిపడుతూనే ఉన్నారు. తాజాగా సోమవారం లోకేశ్ ఓ ట్వీట్ చేశారు.

Also Read:శాసన మండలిపై చంద్రబాబు యూటర్న్ అసెంబ్లీలో వీడియోల ప్రదర్శన

ముఖ్యమంత్రి జగన్ ఇంగ్లీష్ ఎలా ఉంటుందో చూడండంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో సీఎం మాట్లాడుతూ.. అధ్యక్షా.. రాజధాని మార్పు కోసం ఏ బిల్లు అవసరం లేదు, ఏ తీర్మానం అవసరం లేదంటూ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ఇది వాస్తవం అనే బదులుగా, దిస్ ఈజ్ వాస్తవం అని అన్నారు. దీనిని ఉద్దేశిస్తూ సదరు వీడియోను లోకేశ్ ట్వీట్ చేశారు.