తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలం దిగువపుత్తూరులో అంబులెన్స్ లేక తండ్రి ద్విచక్ర వాహనంపైనే తన కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు 

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాల లేమి పలుమార్లు బయటపడుతూనే వుంది. గతేడాది బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ సదుపాయం లేక తండ్రి బైక్‌పైనే బిడ్డ శవాన్ని దాదాపు 100 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లిన ఘటన అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుపతి జిల్లాలో అచ్చం ఇదే రకమైన ఘటన జరిగింది. 

వివరాల్లోకి వెళితే.. కేవీబీ పురం మండలం దిగువపుత్తూరుకు చెందిన చెంచయ్య కుమారుడు ఏడేళ్ల బసవయ్య స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా పిల్లాడిని పాము కాటేసింది. కాసేపటికి బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అక్కడ అంబులెన్స్‌ లేకపోవడం , ప్రైవేట్ వాహనదారులు రాకపోవడంతో ద్విచక్ర వాహనంపైనే తన కుమారుడి మృతదేహాన్ని చెంచయ్య ఇంటికి తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ALso REad:కొడుకు మృతదేహంతో బైక్ పైనే 90కి.మీ... తిరుపతి రుయాలో అమానవీయ ఘటన

ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘జెండా ఊపి ఊరేగించిన అంబులెన్సులు ఏమయ్యాయి సీఎం గారూ? పాముకాటుకు చనిపోయిన తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం దిగువ పుత్తూరుకి చెందిన ఏడేళ్ల తన కొడుకు బసవయ్య మృతదేహాన్ని ఆ తండ్రి బండిపై తీసుకెళ్లిన హృదయవిదారక దృశ్యం మీ అమానవీయ పాలనకి నిదర్శనం‌. సర్కారు అంబులెన్సులు రావు అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…