ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో వైఎస్ జగన్ మరెన్నో పుట్టినరోజులు ఆకాంక్షిస్తూ ఆయన ట్వీట్ చేశారు.

మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జగన్ కలకాలం ఆయురారోగ్యాలతో వర్థాల్లాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.

 

జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును వైసీపీ శ్రేణులు శనివారం ఘనంగా నిర్వహించాయి. కేక్ కటింగ్‌లతో పాటు రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఇక మహారాష్ట్రంలోని లాతూర్ ప్రాంతంలోని ఆయన అభిమానులు జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.