Asianet News TeluguAsianet News Telugu

రఘురామ కృష్ణంరాజుకు ఏం జరిగినా... జగన్ సర్కారుదే బాధ్యత: టిడిపి ఎమ్మెల్సీ మంతెన ఆందోళన

క్షత్రియ కులాన్ని అవమానించేలా పార్లమెంట్ సాక్షిగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును వైసిపి సభ్యులు అవమానించడాన్ని టిడిపి ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు తప్పుబట్టారు. 

TDP MLC Manthena Satyanarayana raju  Reacts on Raghurama Krishnamraju Parliament issue
Author
Amaravathi, First Published Dec 8, 2021, 10:48 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: దేశ పార్లమెంట్ సాక్షిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) క్షత్రియ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిందని టిడిపి ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు (tdp mlc manthena satyanarayanaraju) మండిపడ్డారు. నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు (raghurama krishnamraju)పై తోటి వైసిపి ఎంపీలు పార్లమెంట్ లోనే వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని తప్పుబట్టారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని మంతెన హెచ్చరించారు. 

''సమస్యను ఎత్తిచూపితే ఎదురుదాడికి దిగడం వైసిపి ప్రభుత్వంలో రివాజుగా మారింది. వరదల అంశాన్ని పక్కదారి పట్టించడానికి గతనెల 19వ తేదీన అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) సతీమణి భువనేశ్వరి (nara bhuvaneshwari)పై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. రాష్ట్ర అసెంబ్లీ (ap assembly)ని కౌరవ సభగా మార్చిన వైసిపి నేతలు... ఇప్పుడు ఈ జాడ్యాన్ని పార్లమెంటు (indian parliament)కు కూడా అంటించారు. ఇది ఏ మాత్రం వాంఛనీయం కాదు'' అని మంతెన మండిపడ్డారు.

''రాజకీయంగా విధానాలపైనో, మరే ఇతర సమస్యలపైనో రఘురామ కృష్ణంరాజును విమర్శిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం ఏమాత్రం సమంజసం కాదు. అందరి మాదిరిగానే మా సామాజికవర్గానికి కూడా ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. మా ఆత్మాభిమానం దెబ్బతీసేవిధంగా ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. మరోమారు ఇటువంటి ఘటనలు పునరావృతమైతే తగువిధంగా సమాధానం చెబుతాం'' అని మంతెన హెచ్చరించారు. 

read more  ఒక ముస్సోలిని, హిట్లర్, జార్జ్ చక్రవర్తి... అలాగే జగన్ కూడా : రఘురామ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు

''దేశ పార్లమెంటు సాక్షిగా అసభ్య పదజాలాన్ని ఉపయోగించిన వైసీపీ ఎంపీలపై చర్యలు తీసుకోవాల్సిందిగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్జప్తి చేస్తున్నాం. రఘురామ  కృష్ణంరాజుకు ఏదైనా జరిగితే వైసీపీదే బాధ్యత'' అని ఎమ్మెల్సీ మంతెన పేర్కొన్నారు. 

ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, వైసిపి ఎంపీ (ysrcp mps)ల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఈ క్రమంలోనే వైసిపి ఎంపీలు తనపై వ్యక్తిగత దూషణలకు దిగినట్లు రఘురామ ఆరోపించారు. పవిత్రమైన పార్లమెంట్ లోనే బాపట్ల ఎంపీ నందిగం సురేష్ (nandigam suresh) తనను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసారని రఘురామ ఆరోపించారు. వైసిపి సభ్యుల తీరుపై ప్యానల్ స్పీకర్, స్పీకర్ తో పాటు ప్రధాని మోదీ (narendra modi)కి కూడా ఫిర్యాదు చేసినట్లు రఘురామ తెలిపారు.

read more  ఈ మంత్రులను వైఎస్ జగన్ జగన్‌ మార్చలేరు.. రఘరామ కృష్ణరాజు సంచల వ్యాఖ్యలు.. 

వైసిపి ప్రభుత్వ (ycp government) దాష్టీకాల మీద పోరాటం చేస్తున్నందుకు తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రఘురామ అన్నారు. రైతులు అమరావతి (amaravati) కోసం భూములిస్తే .. విశాఖపట్నం (visakhapatnam)లో దుకాణం తెరుస్తామంటూ ప్రభుత్వం చెప్పడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మీ పాపాలను ప్రశ్నిస్తే బూతులు తిడతారా? అంటూ జగన్ సర్కార్ పై రఘురామ మండిపడ్డారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios