ఒక ముస్సోలిని, హిట్లర్, జార్జ్ చక్రవర్తి... అలాగే జగన్ కూడా : రఘురామ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వంపై (ap govt) వైసీపీ (ysrcp) రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు (raghu rama krishnam raju) మండిపడ్డారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు తాను బీజేపీలో (bjp) చేరుతున్నారన్న వైసీపీ నేతల వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.
ఏపీ ప్రభుత్వంపై (ap govt) వైసీపీ (ysrcp) రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు (raghu rama krishnam raju) మండిపడ్డారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు తాను బీజేపీలో (bjp) చేరుతున్నారన్న వైసీపీ నేతల వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. అన్నం తింటున్నారా..? గడ్డి తింటున్నారా..? రాస్కెల్స్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు బీజేపీతో అంటకాగిందే వైసీపీ నేతలని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. ఏది చేసినా బీజేపీకి చెప్పే చేస్తామంటూ గతంలో విజయసాయిరెడ్డి (vijaysai reddy) చెప్పారని ఆయన గుర్తు చేశారు.
ప్రభుత్వ దాష్టీకాల మీద పోరాటం చేస్తున్నందుకు తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రఘురామ అన్నారు. రైతులు అమరావతి కోసం భూములిస్తే .. విశాఖపట్నంలో దుకాణం తెరుస్తామంటూ ప్రభుత్వం చెప్పడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి (amaravathi) నుంచి ఒక్కొక్క కార్యాలయాన్ని తరలిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దానికి వ్యతిరేకంగా శాంతియుతంగా రైతులు ఉద్యమం చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపాలను ప్రశ్నిస్తే బూతులు తిడతారా? అంటూ ఆయన మండిపడ్డారు. దౌర్జన్యపు సైన్యంలా వాలంటీర్ వ్యవస్థ (volunteer system) ఉందని రఘురామ మండిపడ్డారు. వాళ్లకు జీతమిస్తున్నామని చెప్పి ఉద్యోగులకు జీతం ఇవ్వట్లేదని ఆయన ఆరోపించారు.
Also Read:Amma Vodi: అమ్మ ఒడి కావాలంటే తప్పనిసరిగా ఆ లేఖలపై సంతకాలు ఉండాల్సిందే..
స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం (english medium) గురించి మాట్లాడినప్పటి నుంచే తనపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని రఘురామ చెప్పారు. రాజ్యాంగ విరుద్ధమని చెబితే తనపై అనర్హత వేటు వేయించేందుకు ప్రయత్నించారని దుయ్యబట్టారు. చరిత్రలో జగన్ కూడా గుర్తుండిపోతారని, ఎప్పుడైనా విలన్, హీరోలందరికీ గుర్తింపు ఉంటుందని చెప్పారు. రాముడు, రావణాసురుడు, కృష్ణుడు, కంసుడు.. అంతా గుర్తున్నా వారి వారి చర్యలకు తగ్గట్టు గుర్తుండిపోయారన్నారు. జగన్ కూడా ముస్సోలిని, హిట్లర్, జార్జ్ చక్రవర్తి తరహాలోనే దుర్మార్గుడి జాబితాలో గుర్తుండిపోతారనే తనబాధంతా అని అన్నారు.