శాసనమండలి రద్దు తీర్మానానికి ఆంధ్రప్రదశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. 

‘‘జగన్ గారు మొండి మనిషా? విలువలకు కట్టుబడ్డాడా? గేట్లు తెరిచి ఉంటే టీడీపీ ఖాళీ అయ్యేదా? 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు తిరుగులేదు అని కాలర్ ఎగరేసిన మీకు ఇలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గుగా లేదా సాయి రెడ్డి గారు?‘‘

Also Read:కోర్టుకెళ్లడానికి 30 కోట్లు... మండలికి 60 కోట్లు పెట్టలేవా: జగన్‌పై బాబు ఫైర్

‘‘151 మంది ఎమ్మెల్యేలు ఉంటే 33 మంది ఎమ్మెల్సీలను చూసి జగన్ గారు ఎందుకు భయపడ్డారు? జగన్ గారు విలువలకు తిలోదకాలు ఇచ్చిన వ్యక్తి  స్వయంగా ఏ2 అయిన మిమల్ని రంగంలోకి దింపి సంతలో గొర్రెల్లా ఇద్దరు ఎమ్మెల్సీలను కొని కండువా కప్పలేదా?’’

‘‘151 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు కొనట్టు? మండలిలో కాలు కాలిన పిల్లిలా తిరిగావు, గేట్లు బార్లా తెరిచావు, ఆఫర్లు ప్రకటించావు అయినా ఎమ్మెల్సీలు మిమ్మల్ని, మీ నాయకుడి చర్యల్ని ఛీ కొట్టారు.

ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలనుకోవడం మీ అవివేకం విజయం దూరమైన సాయిరెడ్డి గారు 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారని సజ్జల వారు సెలవిచ్చారు. ఈ రోజు సభలో ముప్పై మంది వైకాపా ఎమ్మెల్యేలు ఎలా మాయం అయ్యారు? అన్నట్టు సంతలో గొర్రెల్లా జగన్ కొన్న ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఏమైనట్టు? ’’ అంటూ వెంకన్న ట్వీట్ చేశారు. 

ఏపీ  శాసనమండలి రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ సోమవారం నాడు తీర్మానం చేసింది.సోమవారం నాడు ఉదయం ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై పలువురు సభ్యులు మాట్లాడారు.

Also Read:శాసనమండలి రద్దు: ఏపీ అసెంబ్లీ ఆమోదం, టీడీపీ గైర్హాజర్

సోమవారం నాడు సాయంత్రం ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ తీర్మానంపై  ప్రసంగించారు.  శాసనమండలిని ఎందుకు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోందో వివరించారు. ఆ తర్వాత  ఏపీ శాసనమండలి రద్దు తీర్మానంపై ఓటింగ్ జరిగింది. 

సీఎం ప్రసంగం తర్వాత  ఈ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఈ తీర్మానానికి అనుకూలంగా ఉన్న సభ్యులంతా లేచి నిలబడాలని స్పీకర్ కోరారు. సభ్యులను లెక్కించిన తర్వాత సభ్యులు కూర్చొన్నారు. ఆ తర్వాత అసెంబ్లీ సిబ్బంది  ఎమ్మెల్యేలను లెక్కించారు. ఏపీ శాసనమండలి రద్దు కోరుతూ తీర్మానానికి అనుకూలంగా 133 మంది ఎమ్మెల్యేలు ఓటు చేశారు.