దాడి విషయంగా నువ్వు చెప్పింది నిజమని జగన్‌పై ప్రమాణం చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సవాల్ విసిరారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. దాడి చేయించింది కాకుండా పిన్నెల్లి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుపై విశాఖలో, లోకేశ్‌పై సీతానగరంలో, ఇవాళ మాచర్లలో మా మీద దాడి చేశారని బుద్ధా గుర్తుచేశారు. ఇది అప్పటికప్పుడు జరిగింది కాదని ముందుగా స్కెచ్ గీసి చేయించిందేనని వెంకన్న ఆరోపించారు.

Also Read:పోలీసుల నుంచే పిన్నెల్లికి ఇన్ఫర్మేషన్: మాచర్ల దాడిపై బొండా వ్యాఖ్యలు

పార్టీ సిద్ధాంతాలపై తమకు క్లాసులు ఉంటాయని.. మీకు దోచుకోవడం, దాచుకోవడం, దాడులు చేయించడం, చంపడం, కేసుల మాఫీలు ఇలాంటివి వైసీపీలో జరుగుతూ ఉంటాయని బుద్ధా వ్యాఖ్యానించారు.

చంద్రబాబు చెప్పినట్లు తాము శాంతిభద్రతలను పరిరక్షించామని.. కానీ ఇవాళ నాయకుడే తప్పు చేసే వ్యక్తని, సొంత బాబాయిని హత్య చేసిన వ్యక్తని, ప్రజల ధనాన్ని దోచుకునే వాడని అందుకే వైసీపీ నాయకులు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారని వెంకన్న ఆరోపించారు.

ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పెట్టుబడులు తీసుకొచ్చిన చంద్రబాబు లాంటి వ్యక్తే.. ప్రతిపక్షంలో కూర్చొన్నారని తొమ్మిది నెలల దుర్మార్గ పాలనలో జగన్‌కు ఇంకెలాంటి గతి పడుతుందో తెలియదన్నారు.

Also Read:మాచర్ల దాడి: బోండా ఉమా కారు ఢీకొట్టింది ఇతన్నే... వీడియో వైరల్

మేము కూడా ఇలాగే చేసుంటే 2014 నుంచి 2019 వరకు వైసీపీ నాయకులు రోడ్లపై తిరిగేవారు కాదన్నారు. చంద్రబాబుకు నిబద్ధత ఉంది కాబట్టే పోలీస్ భద్రతను ఇచ్చి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర సాఫీగా సాగిందని వెంకన్న గుర్తుచేశారు.