పోలీసుల నుంచే పిన్నెల్లికి ఇన్ఫర్మేషన్: మాచర్ల దాడిపై బొండా వ్యాఖ్యలు
ఆ సమాచారం పోలీసుల నుంచి స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వెళ్లిందని అందరూ కలిసి కుట్ర పన్నారని ఉమా ఆరోపించారు.
తాము మాచర్ల వస్తున్న సమాచారం పోలీసుల నుంచి స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వెళ్లిందని అందరూ కలిసి కుట్ర పన్నారని ఉమా ఆరోపించారు.కారు డ్రైవర్ యేసు తనను యేసు క్రీస్తులాగా కాపాడాడని వారి నుంచి తప్పించుకుని ముందుకు వెళ్తే మరో 30 మంది వెంటపడ్డారని బొండా ఉమా చెప్పారు.
మాచర్లలో తమపై జరిగిన దాడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజాస్వామ్య వాదులందరినీ కలవరపరిచిందన్నారు టీడీపీ నేత బొండా ఉమా మహేశ్వరరావు. వైసీపీ కార్యకర్తల దాడి నుంచి తృటిలో తప్పించుకున్న బొండా ఉమా, బుద్దా వెంకన్నలు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.
Also Read:మాచర్ల దాడి: బోండా ఉమా కారు ఢీకొట్టింది ఇతన్నే... వీడియో వైరల్
సీఎం వైఎస్ జగన్ పక్కా స్కెచ్ గీసీ తనను, బుద్ధా వెంకన్నను హత్య చేయాలని ప్లాన్ చేశారని ఆయన ఆరోపించారు. మంగళవారం రాత్రి 8 గంటల వరకు మాచర్లకు వెళ్తామని తమకే తెలియదని.. నిన్న అక్కడ జరిగిన పరిణామాలపై పోలీస్ స్టేషన్‌లో న్యాయవాదిని తీసుకెళ్లి మాట్లాడేందుకు మాచర్లకు వెళ్లామని బొండా స్పష్టం చేశారు.
తాము ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదని, ఎన్నికల్లో రిగ్గింగ్ చేయడానికి వెళ్లలేదని కేవలం ఫిర్యాదు చేయడానికే వెళ్లామని ఆయన వెల్లడించారు. ఒక కారులో తాను, మరో కారులో బుద్ధా వెంకన్న, మూడో కారులో ఇద్దరు లాయర్లు ఉన్నారన్నారు.
Also Read:మాచర్ల దాడి: నారా లోకేష్ కి ఫేక్ ట్వీట్ తిప్పలు...
తాము మాచర్ల వస్తున్నట్లు నిన్న రాత్రే పోలీసులకు సమాచారం ఇచ్చామని ఆయన తెలియజేశారు. కారంచేడు నుంచి తమను అనుసరించారని బొండా ఉమా తెలిపారు. తమకన్నా ముందు లాయర్లు వెళ్తున్న కారును ఆపారని ఆ వెనకే ఉన్న తమ కారుపై కర్రలు, ఇనుపరాడ్లు, చేతి కర్రలతో దాడి చేశారని ఉమా స్పష్టం చేశారు.