అనంతపురం టిడిపి ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరి సంచలన కామెంట్ చేశారు. పవన్ సత్తా ఏంటో తాను అనంతపురంలో తేల్చేస్తానంటూ బహిరంగంగానే చాలెంట్ చేశారు. అసెంబ్లీలో మీడియాతో చౌదరి మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బీజేపీ చేతుల్లో ఉన్నారనే విషయాన్ని మూడు నెలల క్రితమే చెప్పానన్నారు. ప్రస్తుతం జనసేనాని వెనుక బీజేపీ ఉందనే విషయాన్ని వామపక్షాలు గమనించలేక పోతున్నాయన్నారు. చంద్రబాబు తర్వాత తానే ప్రత్యామ్నాయామని పవన్ భావిస్తున్నారని, అందుకే లోకేష్‌పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.  

మరో వైపు పవన్‌ కల్యాణ్‌ మీపైనే పోటీకి రాబోతున్నారంటూ ప్రభాకర్‌ వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ అనంతపురం నుంచి పవన్‌ తనపై పోటీకి వస్తానంటే స్వాగతిస్తానన్నారు. అంతేకాకుండా ఆయనపై పోటీ చేసి తన సత్తా ఏంటో చూపిస్తానని చౌదరి వ్యాఖ్యానించారు.