అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. శాసన సభ ఓ లోటస్ పాండ్ లా తయారైందని ఆరోపించారు. 

ముఖ్యమంత్రి ఆదేశిస్తుంటే స్పీకర్ పాటిస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తుంటే  ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. తమపై సస్పెన్షన్ వేటు రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడ్డారు. 

ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వని శాసన సభను తాను చూడటం ఇదే మెుదటి సారి అని ఆరోపించారు. దేశ చరిత్రలో ఇలాంటి అసెంబ్లీని ఎప్పడూ చూడలేదని నిమ్మల రామానాయుడు అభిప్రాయపడ్డారు.