Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి అస్వస్థత.. ఆ బాధ్యత పోలీసులదే..

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అస్వస్థతకు గురయ్యారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో జరిగిన తోపులాటలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. 

TDP MLA Nimmala Ramanaidu illness in andhrapradesh - bsb
Author
First Published Sep 9, 2023, 12:06 PM IST

పాలకొల్లు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాలకొల్లులోని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిమ్మల రామానాయుడు అస్వస్థతకు గురయ్యారు. చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో టిడిపి నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇదే క్రమంలో నిమ్మల రామానాయుడు ఇంటికి కూడా పోలీసులు చేరుకున్నారు.

ఆ సమయంలో పోలీసులు, టిడిపి శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది.  ఈ తోపులాటలో నిమ్మల రామానాయుడు కింద పడ్డారు. దీంతో అస్వస్థతకు గురయ్యారు. నిమ్మల రామానాయుడుని ఆస్పత్రికి తరలించాలని ఆయన అనుచరులు పోలీసులకు విజ్ఞప్తి చేసినా వినిపించుకోలేదని ఆరోపిస్తున్నారు. నిమ్మల రామానాయుడుకు ఏదైనా జరిగితే పోలీసులే బాధ్యత వహించాలంటూ ఆయన అనుచరులు నినాదాలు చేశారు.

చంద్రబాబును అర్దరాత్రి ఇబ్బంది పెట్టలేదు.. హెలికాప్టర్ ప్రయాణానికి ఆయనే ఒప్పుకోలేదు.. ఏపీ సీఐడీ

ఇదిలా ఉండగా, ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి నంద్యాలలో బహిరంగ సభలో పాల్గొన్నారు. బహిరంగ సభానంతరం అర్ధరాత్రి 12 గంటల నుంచి అరెస్టు నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాల్ చుట్టూ వందలాది పోలీసులు మోహరించారు. దీనికోసం 600 మందికి పైగా పోలీసులు నంద్యాలకు చేరుకున్నారు. 

ఉద్రిక్తతలు నెలకొనకుండా నంద్యాల నగరాన్ని దిగ్బంధించారు.  నంద్యాలలో అడుగడునా బారికేడ్లు, చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆర్కే ఫంక్షన్ హాల్ ప్రాంగణం నుంచి టీడీపీ కార్యకర్తలు మీడియా ప్రతినిధులను దూరంగా పంపించేశారు. ఆ తర్వాత ఆ ప్రాంగణంలో ఉన్న కార్యకర్తలు, నేతల వాహనాలను తొలగించి పోలీసు వాహనాలను లోపలికి తీసుకెళ్లారు.  ఆ ప్రాంతాన్ని మొత్తం పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 

డిఐజి రఘురామిరెడ్డి, ఎస్పి రఘువీర్ రెడ్డిల నేతృత్వంలోని పోలీసు సిబ్బంది చంద్రబాబును నిద్రలేపేందుకు ప్రయత్నిస్తుండగా.. డిఐజి రఘురామిరెడ్డి టిడిపి నాయకుల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. టిడిపి కర్నూలు జిల్లా అధ్యక్షుడు బిటి నాయుడు, మాజీమంత్రి కాలువ శ్రీనివాసులు తలుపుకు అడ్డంగా నిలబడి ప్రతిఘటించారు. 

అంత రాత్రి సమయంలో చంద్రబాబు నిద్రలేపేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ గొడవకు దిగారు. చంద్రబాబును నిద్ర లేపేందుకు తాము ఒప్పుకోమని స్పష్టం చేశారు. దీనికి పోలీసులు సమాధానం ఇస్తూ అడ్డు తొలగకపోతే బాబును బస్సుతో పాటే లాక్కెళ్లాల్సి ఉంటుందని బెదిరించారు.

దీంతో టిడిపి నేతలు కాల్వ శ్రీనివాసులు, ఇతర టిడిపి నాయకులు అసహనం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు  ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి మీరిచ్చే  గౌరవమిదేనా అంటూ మండిపడ్డారు. ఏ చర్యలు తీసుకోవాలనుకున్నా..  ఏం మాట్లాడాలన్నా.. ఉదయం రావాలని తెలిపారు. ఆ తర్వాత బస్సులో నుంచి దిగిన చంద్రబాబు నాయుడుతో వాదనల అనంతరం… ఆయనని అరెస్టు చేసి.. ఆయన భద్రతా బలగాల మధ్యలోనే విజయవాడకు తరలిస్తున్నారు. 

హెలికాప్టర్ లో తరలిస్తామని చెబితే చంద్రబాబునాయుడే ఒప్పుకోలేదని.. రోడ్డు మార్గంలోనే వెళ్లడానికి ఇష్టపడ్డారని సీబీఐ తెలిపింది. ఆయనను కోర్టులో హాజరు పరిచి.. కస్టడీకి తీసుకుంటామని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios