క్షేత్ర స్థాయిలో  బలం లేని  జనసేనకు వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడ  రాదని  టీడీపీ ఎమ్మెల్యే  జలీల్ ఖాన్  చెప్పారు.   స్థానికంగా  బలం లేని  జనసేనకు  ఎలా  సీట్లు వస్తాయని ఆయన ప్రశ్నించారు.


అమరావతి: క్షేత్ర స్థాయిలో బలం లేని జనసేనకు వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడ రాదని టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చెప్పారు. స్థానికంగా బలం లేని జనసేనకు ఎలా సీట్లు వస్తాయని ఆయన ప్రశ్నించారు.

శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు గుంటూరులో టీడీపీ నిర్వహించిన ముస్లిం మైనార్టీ సభలో పథకం ప్రకారంగా వైసీపీ అల్లరి చేయించిందని ఆయన ఆరోపించారు. తుని తరహలోనే ఈ సభలో కూడ అల్లరి చేసేందుకు కుట్ర పన్నిందని ఆయన చెప్పారు.

ప్రత్యర్థి పార్టీల సభల్లో గొడవలు చేయడం వైఎస్‌ కుటుంబానికి అలవాటేనని ఆయన చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోని తన ప్రత్యర్థుల సభల్లో గొడివలు చేయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

2019లో డిప్యూటీ సీఎం పదవిని ముస్లిం మైనారిటీలకు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరినట్టు ఆయన చెప్పారు. ముస్లిం మైనార్టీలకు ప్రయోజనం కల్గించేలా ఈ సభను ఏర్పాటు చేస్తే రాజకీయం చేసేందుకు వైసీపీ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు.