ఏపీ మంత్రి నారాలోకేష్‌ను విమర్శించే నైతిక అర్హత  జనసేన  చీఫ్ పవన్‌కళ్యాణ్‌కు లేదని  వినుకొండ ఎమ్మెల్యే , టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు చెప్పారు.

గుంటూరు: ఏపీ మంత్రి నారాలోకేష్‌ను విమర్శించే నైతిక అర్హత జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్‌కు లేదని వినుకొండ ఎమ్మెల్యే , టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు చెప్పారు.

మంత్రి లోకేష్‌పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు.ఈ విమర్శలపై జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. అందరినీ ప్రశ్నించే పవన్ కళ్యాణ్ .. మీ సోదరుడు చిరంజీవిని ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

హైద్రాబాద్‌లో ఆస్తులను కాపాడుకొనేందుకే కేటీఆర్‌ను పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడని జీవీ ఆంజనేయులు విమర్శలు గుప్పించారు. ప్రజా రాజ్యం పార్టీకి పట్టిన గతే జనసేనకు పడుతోందని ఆంజనేయులు అభిప్రాయపడ్డారు.

ఈ వార్త చదవండి

కెటిఆర్ పోరాడి గెలిచారు, నారా లోకేష్ ఏం చేశాడు: పవన్ కల్యాణ్