Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు కంటతడి... జగనేమో వెకిలి నవ్వులు, వైసీపీలో పనికిమాలిన నేతలంటూ గోరంట్ల వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టడంపై ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు, వైసీపీలో విజ్ఞత గల నాయకులు ఉన్నారా? లేక పనికిమాలిన నేతలు మాత్రమే ఉన్నారా? అని బుచ్చయ్య వ్యాఖ్యానించారు. 

tdp mla gorantla butchaiah chowdary fires on ap cm ys jagan and ysrcp leaders
Author
Amaravati, First Published Nov 19, 2021, 3:40 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఏపీ అసెంబ్లీ సమావేశాలు (ap assembly sessions) వాడివేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరడం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడును, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ (ysrcp) నేతలు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనికి నొచ్చుకున్న చంద్రబాబు... మళ్లీ సీఎం అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ శపథం చేశారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.  

ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (gorantla butchaiah chowdary) స్పందించారు. నీచమైన పదానికి అర్థం వైసీపీ అని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడితో కన్నీరు పెట్టించారని గోరంట్ల మండిపడ్డారు. అసలు, వైసీపీలో విజ్ఞత గల నాయకులు ఉన్నారా? లేక పనికిమాలిన నేతలు మాత్రమే ఉన్నారా? అని బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం (ap cm) జగన్ (ys jagan mohan reddy) వెకిలి నవ్వులు నవ్వుతుండడం సిగ్గుమాలిన చర్య అని .. ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని గోరంట్ల హెచ్చరించారు.

ALso Read:Chandrababu Naidu: ప్రెస్‌మీట్‌లో బోరున విలపించిన చంద్రబాబు నాయుడు.. వెక్కి వెక్కి ఏడ్చిన వైనం

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై చంద్రబాబు (Chandrababu Naidu)  తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ఆయన బోరున విలపించారు. వెక్కి వెక్కి ఏడ్చారు. తాను ప్రజల కోసమే పోరాటం చేశానని చెప్పారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ఇవాళ నా భార్యను కించపరిచేలా దూషించారని కంటతడి పెట్టారు. తన జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదని అన్నారు. నేడు జరిగిన ఘటనపై ఎం చెప్పాలో కూడా అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.  తనకు పదవులు అవసరం లేదని అన్నారు. తన పాలన కాలంలో ఎన్నో రికార్డులు సృష్టించానని.. తన రికార్డులు బద్దలు కొట్టాలంటే చాలా సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయిలో తెల్చకున్న తర్వాతే అసెంబ్లీకి వెళ్తానని చెప్పారు. 

‘బూతులు తిట్టినా, ఎన్ని అవమానాలను గురిచేసినా భరించాం. అధికారంలో ఉన్నప్పుడూ నేనెవరినీ కించపరచలేదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి (ys rajasekhara reddy) కూడా శాసన సభలో నా తల్లిని అవమానించారు. ఆనాడు వైఎస్ తప్పు ఒప్పుకుని నాకు క్షమాపణ చెప్పారు. అవతలి వ్యక్తులు బూతులు తిడుతున్నా.. సంయవనం పాటిస్తున్నాను. రేండున్నరేళ్లుగా అవమానిస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా నేను బాధపడలేదు. అధికారంలోకి వచ్చాక మా పార్టీ నేతలను అరెస్ట్ చేయడమే పనిగా పెట్టున్నారు. 

నా భార్య ఆమె వ్యక్తిగత జీవితం కోసం, నా కోసం మాత్రమే పని చేసింది. ముఖ్యమంత్రి భార్యగా ఉన్న సమయంలో ఆమె ఏ రోజు కూడా రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. ప్రజల కోసం ఇంటికి రాకుండా ఎంతకాలం పనిచేసినా నా భార్య పోత్సహించింది. హుద్ హుద్ తుపాన్ సమయంలో (hudhud cyclone) విశాఖపట్నంలో చాలా రోజులు ఉన్నాను శాసనసభలో తన ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని సీతారాం (tammineni sitaram) కూడా ఆలోచించుకోవాలి. నేను మాట్లాడుతుండగానే నా మైక్ కట్ చేశారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios