విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని రాష్ట్రం నుండి అఖిలపక్ష ప్రతినిధులను ఢిల్లీకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే  గంటా శ్రీనివాసరావు చెప్పారు.

 విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని రాష్ట్రం నుండి అఖిలపక్ష ప్రతినిధులను ఢిల్లీకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు.

ఈ మేరకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం నాడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాయడంపై ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రధానికి లేఖ రాయడాన్ని ఆయన స్వాగతించారు.

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…

స్వంత ఇనుప ఖనిజ గనిని కేటాయించడం, రుణాలను ఈక్విటీలుగా మార్చడం ద్వారా స్టాక్ ఎక్స్చేంజిలో నిధుల సేకరణకు అవకాశం వంటి పరిష్కార మార్గాలు ఉన్నాయని గంటా శ్రీనివాసరావు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు.



విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకొన్నందున అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లి విశాఖతో పాటు తెలుగు ప్రజల మనోభావాలను ప్రధానికి వివరించి ఆయనను ఒప్పించాలని గంటా కోరారు.