Asianet News TeluguAsianet News Telugu

చెల్లికి మళ్లీ మళ్లీ పెళ్లి చేస్తామన్నట్లు... సీఎం జగన్ పై టిడిపి ఎమ్మెల్యే సెటైర్లు

టిడిపి ప్రభుత్వ హయాంలో 2015లోనే కరకట్ట నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభించడం జరిగిందని... 2018లో ఈ కరకట్ట నిర్మాణంలో తొలిదశ పూర్తయిందన్నారు టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. 

TDP MLA Gadde Rammohan Rao Satires on CM YS Jagan
Author
Vijayawada, First Published Apr 1, 2021, 2:54 PM IST

విజయవాడ:  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడ కృష్ణలంకలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి చేసిన శంఖు స్థాపన ప్రక్రియ ఆసాంతం ఒక ప్రహసనాన్ని తలపించిందని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు విమర్శించారు. 2014కు ముందు ప్రజల కోరికను మన్నించి ఆనాడు టీడీపీ ప్రజలపక్షాన రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పోరాడిందని... ప్రతినెలా వివిధరకాల నిరసన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని  తెలిపారు. విజయవాడ నగర సమగ్రాభివృద్ధి కోసం టీడీపీ పనిచేసిందని... బుద్దా వెంకన్న నాయకత్వంలో ఫ్లైఓవర్ నిర్మాణం కోసం, బొండా ఉమామహేశ్వరరావు నాయకత్వంలో బుడమేరు డైవర్షన్ నిర్మాణం కోసం నాడు టీడీపీ పోరాడిందన్నారు.

ఇక టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు తొలిసారి విజయవాడకు వచ్చా రని... కరకట్ట నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పడం జరిగిందన్నారు. 2015లో టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఎంతటి వరదలు వచ్చినా తట్టుకునేలా కరకట్ట(రిటైనింగ్ వాల్) నిర్మాణం చేయాలని టీడీపీ ప్రభుత్వం భావించిందన్నా రు. భూమిపైన ఎంతఎత్తు ఉంటుందో, అంతే ఎత్తు భూమి లోపలకూడా ఉండేలా పిల్లర్లను భూమిలోపలికి వేసి నిర్మాణం చేయాలనుకున్నట్లు రామ్మోహన్ రావు చెప్పారు. మంత్రిగా ఉన్న దేవినేని ఉమ కూడా కరకట్ట నిర్మాణానికి తగిన చొరవ తీసుకొని నిదులు విడుదల చేయించారని, 14-06-2015న శంఖుస్థాపన చేయడం కూడా జరిగిందన్నారు. 

కరకట్ట నిర్మాణంపై అధికారులు అనేక సమాలోచనలు, సంప్రదింపులు జరిపారని... శాశ్వతంగా వరద ముంపు సమస్య పరిష్కారమయ్యేలా నిర్మాణం చేయాలని భావించారన్నారు. 2018లో కరకట్ట నిర్మాణంలో తొలిదశ పూర్తయిందన్నారు. నిర్మాణానికి అవసరమైన నిధులను మూడు దశల్లో ఇవ్వాలని నాటి ప్రభుత్వం నిర్ణయించిందని, తొలి దశకు రూ.165కోట్లు, రెండో దశ నిర్మాణానికి రూ.145కోట్లు, మూడో దశలో మిగిలింది చెల్లించేలా నాడు తీర్మానం చేయడం జరిగిందన్నారు. 

తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చిందని, కరకట్ట నిర్మాణంలో ఈ ప్రభుత్వం రెండేళ్లు కాలయాపన చేసిందన్నారు. అధికారంలోకి రాగానే పనులు ప్రారంభించి ఉంటే దాదాపు 5కిలోమీటర్ల వరకు రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయి ఉండేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో శంఖుస్థాపన జరుపుకొని, కొంత నిర్మాణం పూర్తైన రిటైనింగ్ వాల్ కు తిరిగి  శంఖుస్థాపన చేయడం ద్వారా ఈ ముఖ్యమంత్రి అంతా తామే చేశామని ప్రజలను నమ్మించే పనిలో ఉన్నాడని ఆరోపించారు. జగన్ అధికారంలోకి రాగానే రిటైనింగ్ వాల్ నిర్మాణంపై దృష్టి పెట్టి ఉంటే ఈ రెండేళ్లలో వచ్చిన వరదలకు విజయవాడలోని లోతట్టు ప్రాంతాలవారికి కష్టాలు లేకుండా ఉండేవన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం 30 సంవత్సరాల కలని ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదమన్నారు. 

టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన కర్నూలు ఓర్వకల్లు వి మానాశ్రయాన్ని తిరిగిప్రారంభించి తానే నిర్మించినట్లు ముఖ్యమంత్రి పోజులివ్వడం దురదృష్టకరమన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణంలో తొలిదశను తెలుగుదేశం ప్రభుత్వమే పూర్తి చేసిందని, ముఖ్యమంత్రి ఇప్పుడు రెండోదశ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారన్నారు. ఆనాడు టీడీపీ ప్రభుత్వం రిటైనింగ్ వాల్ పక్కన 70 అడుగుల వెడల్పురోడ్డుఉండేలా ప్రణాళికలు వేసిందన్నారు. టీడీపీ హాయాంలో నిర్మితమైన వాల్ కోసం ఎక్కడా ఒక్కఇల్లు కూడా  తొలగించలేదని, వాల్ కు ఇప్పుడున్న కాలనీ కి మధ్యన 70అడుగుల వెడల్పుస్థలముంటే, దానిలో రోడ్డువేయాలని నిర్ణయించడమైందన్నారు. 

తొలిదశ నిర్మాణంలో ఒక్క ఇల్లుకూడా పోకుండా టీడీపీ ప్రభుత్వం వాల్ ను నిర్మిస్తే, రెండోదశ నిర్మాణంకోసం వైసీపీ ప్రభుత్వం మూడొంతల ఇళ్లను తొలగించడానికి సిద్ధమైందని టీడీపీ ఎమ్మెల్యే ఆక్షేపించారు. మూడొంతుల ఇళ్లను తీస శాక, వాల్ ను నిర్మించినా ఎవరికి ఉపయోగం ఉంటుందో ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. చెల్లికి మళ్లీమళ్లీ పెళ్లి అన్నట్లుగా చేసిన శంఖుస్థాపనలే మళ్లీ మళ్లీ చేస్తున్నముఖ్యమంత్రికి రిటైనింగ్ వాల్ నిర్మా ణం యొక్కఅసలు ఉద్దేశం తెలియకపోవడం బాధాకరమన్నారు. నిర్మాణం యొక్క గొప్పతనం, ఉద్దేశం తెలుసుకోకుండా, కనీసం 40అడుగులవెడల్పు రోడ్డైనా లేకుండా నిర్మాణంచేసినా దానివల్ల ఉపయోగం ఉండదని రామ్మోహన్ రావు తేల్చిచెప్పారు. 

రెండోదశ నిర్మాణాని కి ప్రభుత్వం మూడొంతుల ఇళ్లకు మార్కింగ్ ఇచ్చారని, కేవలం ఒకవంతు ఇళ్లకోసం నిర్మాణంచేయడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. శంఖుస్థాపనల పేరుతో అందమైన రాళ్లేయడం కాకుండా, చేసే నిర్మాణం పేదలకు ఉపయోగపడేలా ఉండేలా చూడాలని టీడీపీ తరుపున కోరుతున్నామన్నారు. దాదాపు 40వేల కుటుంబాలకు రక్షణగా ఉండే రిటైనింగ్ వాల్ నిర్మాణంలో అలసత్వం, అవినీతి, అశ్రధ్ద ఉండటం మంచిదికాదని టీడీపీ ఎమ్మెల్యే హితవు పలికారు. గత ప్రభుత్వమే రిటైనింగ్ వాల్ నిర్మాణానికి చేయాల్సిందంతా చేసిందని, ఎంతటివరద వచ్చినా తట్టుకునేలా నిర్మాణాన్నిప్రారంభించి ఒకదశను పూర్తి చేసిందన్నారు. వాల్ కు సపోర్ట్  గా, టీడీపీ హాయాంలో వేసిన ఇసుకను కూడా ఈప్రభుత్వంలో కొందరు దొంగిలించారన్నారు. 

ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా కాంక్రీట్ సిమెంట్ రోడ్డుని వాల్ కు మద్ధతుగా ఏర్పాటు చేయాలన్నారు. శంఖుస్థాపన చేశాం పనైపోయిందన్నట్టు కాకుండా, భవిష్యత్ లో అందరూ చెప్పుకునేలా వాల్ నిర్మాణం చేపట్టాలని రామ్మోహన్ రావు కోరారు. గత ప్రభుత్వంలో జరిగిన వాల్ నిర్మాణం కళ్లముందు కనిపిస్తోందని, ఆనాడు పనిచేయించిన అధికారులు ఇప్పుడుకూడా ఉన్నారన్నారు. విజయవాడకు కీలకమైన రిటైనింగ్ వాల్ నిర్మాణం, ఫ్లైఓవర్, బుడమేరు వంతెన నిర్మాణం పనులను ప్రారంభించిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుంది తప్ప, ఎవరెంతగా తాపత్రయపడినా ప్రజలు వారిని గుర్తించరని గద్దె రామ్మోమన్ రావు తేల్చిచెప్పారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios