రోజా ఓ వ్యభిచారి.. బ్రోతల్ హౌస్ నడుపుతుందంటే నమ్మేస్తారు: టీడీపీ ఎమ్మెల్యే బోడేప్రసాద్

TDP MLA Bode Prasad Sensational Comments on YCP MLA Roja
Highlights

తనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా.. ఆ పార్టీ నేత పార్థసారథి చేస్తున్న విమర్శలపై స్పందించారు. కృష్ణాజిల్లా పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్.

తనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా.. ఆ పార్టీ నేత పార్థసారథి చేస్తున్న విమర్శలపై స్పందించారు. కృష్ణాజిల్లా పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్. తనపై రోజా పిచ్చి విమర్శలు చేస్తున్నారని వాటిని నియోజకవర్గ ప్రజలు నమ్మరని.. అదే రోజాను ఓ వ్యభిచారి.. బ్రోతల్ హౌస్ నడుపుతుందని తాను అంటే.. కచ్చితంగా నమ్మేస్తారని ఆరోపించారు. నిరాధార ఆరోపణలు చేస్తే ఈసారి రోజాకు చెప్పుల దండతో స్వాగతం పలుకుతామని హెచ్చరించారు.

తనను ఎదుర్కొనే సత్తాలేకే పార్థసారథి.. రోజాను అడ్డం బెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.. తనను చిన్నపిల్లోడిగా పోలుస్తూ.. బచ్చా అనడం పార్థసారథి లుచ్చాతనానికి నిదర్శనమని ప్రసాద్ ఆరోపించారు.. రాబోయే ఎన్నికల్లో తనపై గెలిచే సత్తా పార్థసారథికి లేదని.. దమ్ముంటే జగన్ ఇక్కడి నుంచి గెలవాలని సవాల్ విసిరారు. వైఎస్ జగన్ లాంటి అవినీతిపరుడు ఏపీలో కాకుండా వేరే దేశంలో ఉండివుంటే కచ్చితంగా కాల్చిచంపేవారని బోడే ప్రసాద్ వ్యాఖ్యానించారు.

loader