Asianet News TeluguAsianet News Telugu

మీటింగ్‌ మధ్యలో వాంతులు: పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్‌కు తీవ్ర అస్వస్థత

ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం అమరావతి సచివాలయంలో పీఏసీ సమావేశం జరుగుతుండగా పయ్యావులకు ఒక్కసారిగా చెమటలు పట్టి, వాంతులు చేసుకున్నారు.

TDP MLA, ap pac chairman payyavula keshav hospitalized
Author
Vijayawada, First Published Nov 7, 2019, 2:41 PM IST

ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం అమరావతి సచివాలయంలో పీఏసీ సమావేశం జరుగుతుండగా పయ్యావులకు ఒక్కసారిగా చెమటలు పట్టి, వాంతులు చేసుకున్నారు.

వెంటనే స్పందించిన సిబ్బంది సెక్రటేరియట్‌లోని డిస్పెన్సరికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కేశవ్‌ను విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అసిడిటీ కారణంగానే అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలు కమిటీలను ఏర్పాటు చేస్తూ సెప్టెంబర్ నెలలో బులెటిన్ విడుదలయ్యింది. పీఏసీ కమిటీ ఛైర్మన్‌గా టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్‌, అంచనాల కమిటీ ఛైర్మన్‌గా రాజన్న దొర, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఛైర్మన్‌గా చిర్ల జగ్గిరెడ్డిని నియమించారు.

Also Read:పీఎసీ చైర్మెన్ పదవికి పయ్యావుల కేశవ్ పేరు ఖరారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలు కమిటీలను ఏర్పాటు చేస్తూ బులెటిన్ విడుదలయ్యింది. పీఏసీ కమిటీ ఛైర్మన్‌గా టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్‌, అంచనాల కమిటీ ఛైర్మన్‌గా రాజన్న దొర, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఛైర్మన్‌గా చిర్ల జగ్గిరెడ్డిని నియమించారు.

ఒక్కొక్క కమిటీలో ఉభయ సభలకు చెందిన 12 మంది సభ్యులకు ప్రాతినిధ్యం కల్పించారు. పీఏసీ ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. పబ్లిక్ అకౌంట్స్ ఛైర్మన్ పదవికి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు.

కేబినెట్ ర్యాంక్ కలిగిన ఈ పదవి కోసం టీడీపీ నుంచి పలువురు పోటీపడగా.. పయ్యావులకు బాబు అవకాశం ఇచ్చారు. ఉరవకొండ నుంచి ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

Also Read:ఏపీ అసెంబ్లీలో మూడు కమిటీల ఏర్పాటు: పీఏసీ ఛైర్మన్‌గా పయ్యావుల

పీఎసీ చైర్మెన్ పదవిని  విపక్ష పార్టీకి కట్టబెట్టడం సంప్రదాయం. ఉరవకొండ నుండి కేశవ్ నాలుగో దఫా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

పీఎసీ ఛైర్మెన్ పదవికి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేరును చంద్రబాబునాయుడు ప్రతిపాదించారు.చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పీఏసీ చైర్మెన్ గా ఉన్నారు. 

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  కంటే ముందు భూమా నాగిరెడ్డి పీఏసీ చైర్మెన్ గా పనిచేశారు. పీఏసీ చైర్మెన్ పదవికి భూమా నాగిరెడ్డి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. దీంతో బుగ్గనకు ఈ పదవి దక్కింది. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నాగం జనార్ధన్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడులు పీఏసీ చైర్మెన్లుగా పనిచేశారు.పీఏసీ చైర్మెన్ పదవికి పయ్యావుల కేశవ్ తో పాటు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్  పేర్లను చంద్రబాబునాయుడు పరిశీలించారు. 

బీసీ సామాజికవర్గానికి చెందిన అనగాని సత్యప్రసాద్ వైపు మొగ్గు చూపారు చంద్రబాబు. బీసీ సామాజిక వర్గానికి చెందిన సత్యప్రసాద్  కు ఈ పదవిని కట్టబెట్టాలని కొందరు నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు.అయితే అసెంబ్లీ వ్యవహరాలపై మంచి పట్టున్న పయ్యావుల కేశవ్ వైపే చంద్రబాబు మొగ్గు చూపారు.

Follow Us:
Download App:
  • android
  • ios