ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలు కమిటీలను ఏర్పాటు చేస్తూ బులెటిన్ విడుదలయ్యింది. పీఏసీ కమిటీ ఛైర్మన్‌గా టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్‌, అంచనాల కమిటీ ఛైర్మన్‌గా రాజన్న దొర, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఛైర్మన్‌గా చిర్ల జగ్గిరెడ్డిని నియమించారు.

ఒక్కొక్క కమిటీలో ఉభయ సభలకు చెందిన 12 మంది సభ్యులకు ప్రాతినిధ్యం కల్పించారు. పీఏసీ ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. పబ్లిక్ అకౌంట్స్ ఛైర్మన్ పదవికి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు.

కేబినెట్ ర్యాంక్ కలిగిన ఈ పదవి కోసం టీడీపీ నుంచి పలువురు పోటీపడగా.. పయ్యావులకు బాబు అవకాశం ఇచ్చారు. ఉరవకొండ నుంచి ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.