గుంటూరు: కరోనా ఉదృతి సమయంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ ప్రభుత్వ మూర్ఖత్వమేనని టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. విద్యార్థులే పరీక్షలు వద్దంటుంటే నిర్వహించడానికి జగన్ రెడ్డి ఎవరు? అని ముఖ్యమంత్రిని అనగాని నిలదీశారు. 

''దేశంలోని దాదాపు 16 రాష్ట్రాలతో పాటు ఐసిఎస్‌ఇ, సిబిఎస్‌ఇ బోర్డులు పరీక్షలు రద్దు చేస్తే ఏపీలో ఎందుకు రివర్స్ నిర్ణయాలు? పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో కోవిడ్ మూడో దశకు జగన్, మంత్రి సురేష్ లు తెర తీసే ప్రయత్నాలు చేస్తున్నారు'' అన్నారు. 

read more  సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు, మరి ఫలితాలెలా.. కమిటీని నియమించిన బోర్డ్

''తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి  వస్తే కరోనా పెరుగుతుందని రాకుండా ఆగిపోయిన ముఖ్యమంత్రి  విద్యార్థుల జీవితాలను బలిపీఠం ఎక్కిస్తారా? విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా టెన్త్ , ఇంటర్ పరీక్షలు రద్దు చేసి  పైతరగతులకు ప్రమోట్ చేయాలి'' అని అనగాని సూచించారు. 

ఇదిలావుంటే ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరుతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేస్ స్పష్టం చేశారు. కోవిడ్ ఉద్ధృతి తగ్గాక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరడం లేదని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు దీనిమీద అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు.