ఏలూరు జిల్లా నూజీవీడు మండలం బత్తలవారిగూడెంలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన సభలో నేతలు కూర్చొన్న సభావేదిక ఒక్కసారిగా కుప్పకూలింది.

ఏలూరు జిల్లా నూజీవీడు మండలం బత్తలవారిగూడెంలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన సభలో అపశృతి చోటు చేసుకుంది. నేతలు కూర్చొన్న సభావేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రసంగిస్తుండగా.. బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో వేదికపై వున్న సీనియర్ నేతలు చినరాజప్ప , చింతమనేని ప్రభాకర్, పీతల సుజాత తదితరులు కందపడ్డారు. వెంటనే అప్రమత్తమైన నేతలు, కార్మికులు వారిని పైకి లేపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.