పశ్చిమగోదారి జిల్లాకు చెందిన ఓ మహిళా నేత , కాళ్ల జడ్పీటీసీ సభ్యురాలు వెంకటరమణ టీడీపీకి  రాజీనామా చేశారు. ఆర్థిక లావాదేవీల కేసులో ఇటీవల ఆమె భర్త జయరాజుని పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. తన భర్తపై తప్పుడు కేసులు పెట్టి మరీ కావాలని అరెస్టు చేయించారంటూ ఆమె ఆరోపిస్తూ.. పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం.

ఉండి నియోజకవర్గంలో టీడీపీ పటిష్టంగా ఉంది. కాళ్ల మండంలోనూ టీడీపీ కి మంచి గ్రిప్ ఉంది. అలాంటి సమయంలో జడ్పీటీసీ సభ్యురాలు పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. వీరు తొలుత కాంగ్రెస్ పార్టీ కి చెందిన నేతలు కాగా.. గత ఎన్నికల్లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి పార్టీకి సేవలు చేస్తున్నారు.

అయితే.. మారుతున్న రాజకీయ పరిణామాల  దృష్ట్యా.. ఆమె తన భర్తతో కలిసి జనసేన పార్టీలో చేరేందుకు ప్రణాళికలు చేసుకున్నట్లు సమాచారం. తాజాగా భర్త అరెస్టుని సాకుగా చూపించి.. ఆమె పార్టీకి రాజీనామా చేశారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.