బీజేపీ నేత పురందేశ్వరికి.. టీడీపీ మహిళా నేత యామిని కౌంటర్ ఇచ్చారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తారని ఆమె అన్నారు.

ప్రస్తుతం టీడీపీ.. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా... కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోందని పురందేశ్వరి ఆరోపించారు. కాగా.. ఆ ఆరోపణలను యామిని తిప్పి కొట్టారు. గతంలో పురందేశ్వరి కాంగ్రెస్ మంత్రిగా పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా అని యామిని.. పురందేశ్వరిని ప్రశ్నించారు.

ప్రజా ప్రయోజనాలే టీడీపీకి, సీఎం చంద్రబాబుకి ముఖ్యమని..రాజకీయాలు కాదని ఆమె తెలిపారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తన ఉనికి కోసమే ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీజేపీ అదిష్టానం ఆశీస్సులు కోసమే జీవీఎల్ తపనపడుతున్నారని ఆమె విమర్శించారు.

మోదీ ఇష్టానుసారంగా విదేశీ పర్యటనలు చేసినప్పుడు జీవీఎల్ కి కనపడలేదా,రాఫెల్ కుంభకోణంపై సమాధానం చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు.