సీతాగనగరంలో ఇటీవల ఓ యువతిపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో.. ప్రభుత్వం బాధితురాలికి రూ.5లక్షలు అందజేశారు. 

యువతిపై అత్యాచారం జరిగితే... అత్యాచార ఘటనకు ఖరీదు కట్టి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతులు దులుపుకుందని.. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు.తాడేపల్లి పరిధిలోని సీతాగనగరంలో ఇటీవల ఓ యువతిపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో.. ప్రభుత్వం బాధితురాలికి రూ.5లక్షలు అందజేశారు. 

కాగా... ఈ ఘటనపై తాజాగా అనిత మాట్లాడారు. సీఎం నివాసానికి కూతవేటు దూరంలోనే ఇలాంటి ఘటనలు జరిగితే రాష్ట్రంలో ఆడవాళ్లకు భద్రత ఎక్కడుందని ప్రశ్నించారు. రాష్ట్ర హోం మంత్రి, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌, మహిళా ఎమ్మెల్యేలు సీఎం జగన్‌కు భజన చేయడం మానుకుని మహిళల భద్రతపై దృష్టిపెట్టాలని అన్నారు. 

ఇలాంటి ఘటనలు ఇకపై జరగకుండా చూస్తామని చెప్పవలసిన డీజీపీ.. గంజాయి బ్యాచ్‌లు పెరిగిపోయాయని చెప్పడం సిగ్గుమాలిన చర్య అని అనిత వ్యాఖ్యానించారు. తొలుత గుంటూరు జీజీహెచ్‌లో ఉన్న బాఽధితురాలని టీడీపీ నేతలతో కలిసి ఆమె పరామర్శించారు. కాగా, రాష్ట్రంలో నేరస్తులు.. ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడటం లేదని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. 

అన్ని పనులు ఆపి, ముఖ్యమంత్రి జగన్‌ కంట్రోల్‌ రూమ్‌లో కూర్చుని కేసు దర్యాప్తును పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు భరోసా లేని దుస్థితి ఏర్పడిందని జై భీమ్‌ యాక్సెస్‌ జస్టిస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం నివాసానికి అతి సమీపంలో యువతిపై అత్యాచారం జరగడం దారుణమని అన్నారు.