ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం తొలి సస్పెన్షన్ జరిగిన సంగతి తెలిసిందే. సభను సజావుగా సాగనివ్వడం లేదనే కారణంతో  టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడలను డిప్యుటీ స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన చెప్పారు.

ఈ నేపథ్యంలో సస్పెన్షన్ కి గురైన ముగ్గురు ఎమ్మెల్యేలు డిప్యుటీ స్పీకర్ కోన రఘుపతిని కలిశారు. తమపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని ఈ సందర్భంగా వారు డిప్యుటీ స్పీకర్ ని కోరారు. అచ్చెన్నాయుడు తన సీటులో నుంచి కదలకపోయినా.. ఎలా సస్పెండ్ చేస్తారని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. 

వీరి విన్నపం విన్న తర్వాత డిప్యుటీ స్పీకర్ కోన రఘుపతి.. వైసీపీ నేత బుగ్గనతో సమావేశమయ్యారు. అనంతరం మరోసారి కోన రఘుపతి టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. మరి వారి విన్నపాన్ని స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.