నేడు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతల బృందం.. వివరాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను తెలుగుదేశం పార్టీ నేతలు ఈరోజు కలవనున్నారు. టీడీపీ నేతలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ సాయంత్రం 5 గంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను తెలుగుదేశం పార్టీ నేతలు ఈరోజు కలవనున్నారు. టీడీపీ నేతలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ సాయంత్రం 5 గంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, పార్టీ నేతల నిర్బంధాలు, రాష్ట్రంలోని పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్‌పై గవర్నర్ అనుమతికి సంబంధించి పీసీ యాక్ట్‌లోని 17ఏ పై సుప్రీం కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. వాదనల అనంతరం సుప్రీం కోర్టు కూడా తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ క్రంలోనే గవర్నర్‌తో టీడీపీ నేతలు భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే చంద్రబాబు కేసులపై గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరా తీసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈరోజు సాయంత్రం గవర్నర్‌తో జరిగే సమావేశంలో.. వైసీపీ ప్రభుత్వం 17ఏను కావాలనే పక్కకు పెట్టిందనే అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉందని టీడీపీ నేతలు ప్రస్తావించనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.