మరికొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం.. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన టీడీపీ నేతలు

First Published 23, Jun 2018, 10:56 AM IST
TDP Leaders stuck in lift at vijayawada
Highlights

మరికొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం.. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన టీడీపీ నేతలు

బెజవాడలో టీడీపీ నేతలు లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల కార్పోరేషన్ ఛైర్మన్‌గా చల్లా రామకృష్ణారెడ్డి ఇవాళ బాధ్యతలను స్వీకరించనున్నారు.. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టీడీపీ నేతలు బుద్దా రాజశేఖర్ రెడ్డి, మీనాక్షినాయుడు నగరంలోని సివిల్ సప్లైస్ కార్యాలయానికి చేరుకున్నారు. పై అంతస్తులోకి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కగా.. మార్గమధ్యంలో లిఫ్ట్ ఆగిపోయింది.. దానిని తెరిచేందుకు నేతలు ప్రయత్నించినప్పటికి వాళ్ల వల్ల కాలేదు.. దీంతో 15 నిమషాల పాటు వారు లిఫ్ట్‌లోనే ఉండిపోయారు.. విషయం తెలుసుకున్న సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు కర్రలు, రాడ్లను ఉపయోగించి తలుపులు తెరిచి.. వారిని క్షేమంగా బయటకు తీశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

loader