కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్య దారుణ హత్యకు గురైన ఘటన మరవకముందే గుంటూరు జిల్లాలో అదే పార్టీకి చెందిన నేత హత్యకు గురయ్యాడు.

దాచేపల్లి సితార రెస్టారెంట్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్‌లో తెలుగుదేశం పార్టీ నేతను ప్రత్యర్ధులు హతమార్చారు. ఆయనను పెదగార్లపాడు కు చెందిన పురంశెట్టి‌ అంకుల్‌గా గుర్తించారు.

పెదగార్లపాడు గ్రామంలో టీడీపీనేతగా వున్న అంకులు.. సర్పంచిగా పదిహేను సంవత్సరాలు సేవలందించారు. గతంలో అంకుల్‌ను పంచాయతీకి పిలిచి ప్రత్యర్థులు గొంతు కోశారు.