Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో ఆలయాలపై దాడులు: సీబీఐ విచారణ కోరుతూ గవర్నర్ కు టీడీపీ వినతి

రాష్ట్రంలోని ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై  ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

TDP leaders meeting with AP Governor biswabhusan lns
Author
Guntur, First Published Jan 7, 2021, 1:27 PM IST

అమరావతి:  రాష్ట్రంలోని ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై  ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

టీడీపీ నేతలు వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గవర్నర్ కు గురువారం నాడు వినతి పత్రం సమర్పించారు.  ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లడారు.

also read:చంద్రబాబుపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో 145 ఆలయాలపై దాడులు జరిగినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఆలయాలపై దాడులు జరుతున్నాయని చెప్పడం తప్పా అని టీడీపీ నేతలు ప్రశ్నించారు.

ఆలయాలు, విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని  కోరినా కూడ ఎందుకు కేసులు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆలయాలపై జరుగుతున్న దాడులపై సీబీఐతో విచారణ జరిపించాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఇదే విషయాన్ని గవర్నర్ ను కోరినట్టుగా టీడీపీ నేతలు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios