విశాఖపట్నం జిల్లాలో టిడిపికి పెద్ద షాక్ తగిలింది. జిల్లాలోని అరకు నియోజకవర్గంలో టిడిపికి చెందిన పలువురు సర్పంచులు, ఎంపిటిసి తదితరులు పెద్ద ఎత్తున వైసిపిలో చేరారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్రలో ఉన్న వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వారంతా భారీగా తరలివచ్చి వైసిపి కండువాలు కప్పుకున్నారు. మాజీ ఎంఎల్ఏ కుంబా రవికుమార్ తో మాట్లాడుకున్న సుమారు 400 మంది గిరిజన నేతలు సోమవారం జగన్ ను కలిసారు. వైసిపిలో చేరిన వారిలో 62 మంది సర్పుచులు, 26 మంది ఎంపిటిసిలతో పాటు 45 మంది మాజీ సర్పంచులు కూడా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తామంతా వైసిపి గెలుపుకు కృషి చేస్తామంటూ జగన్ కు హామీ ఇచ్చారు.