వైసిపిలో చేరద్దంటూ వసంతపై ఒత్తిడి

First Published 9, Apr 2018, 10:55 AM IST
tdp leaders bringing pressure on vasanta not to join ycp
Highlights
టిడిపిలో వసంతకు పెద్దగా ప్రాధాన్యం దక్కటం లేదు.

వైసిపిలో చేరుతారని ప్రచారంలో ఉన్న వసంత కృష్ణప్రసాద్ ను వైసిపిలో చేరొద్దంటూ టిడిపి నేతలు ఒకవైపు ఒత్తిడిపెడుతూనే మరోవైపు బ్రతిమలాడుకుంటున్నారు.

మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, టిడిపి సీనియర్‌ నేత వసంత కృష్ణ ప్రసాద్‌ వైసిపిలో చేరటానికి నిర్ణయించుకున్నట్లు జరుగుతున్న ప్రచారంతో టిడిపి నేతలు అప్రమత్తమయ్యారు.

టిడిపిలో వసంతకు పెద్దగా ప్రాధాన్యం దక్కటం లేదు. దానికితోడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటానికి దాదాపు అవకాశం కూడా లేదని సమాచారం.  టిడిపిలో ఉండి ఉపయోగం లేదని నిర్ణయించుకున్న వసంత  వైసీపీలోకి చేరబోతున్నట్టుగా పత్రికల్లో రెండు రోజుల నుండి కథనాలు వస్తున్నాయ్.

దాంతో వెంటనే  జిల్లాకు చెందిన ఓ ఎంపీ, గుంటూరు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి వసంతతో చర్చలు మొదలుపెట్టారు. టిడిపిని వీడొద్దంటూ గట్టిగా చెబుతున్నారు.

ఎట్టి పరిస్ధితుల్లోనూ వైసిపిలో చేరకూడదంటూ చెబుతున్నారు. పరిస్థితిని సీఎం చంద్రబాబుకు వివరించామని, తొందరపడ వద్దని నచ్చజెపుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన వద్దకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

loader