జగన్ వ్యాఖ్యలకు వ్యతిరేకించిన టిడిపి నేతలు జగన్ పై ధ్వజమెత్తిన ఎంపీలు,ఎమ్మెల్యేలు జగన్ ను సమాజం నుండి వెలివేయాలన్న కేశవ్
నిన్న నంద్యాల సభలో వైసీపీ అధినేత జగన్.. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ కు వ్యతిరేకంగా టిడిపి నేతలు విమర్శలు చేశారు
టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, తండ్రి వయసున్న చంద్రబాబును జగన్ దూషించడం దారుణమని అన్నారు. తమ నాయకుడి పై అనుచిత వ్యాక్యలు తగవని ఆయన సూచించారు. తాము అధికారంలోకి వస్తే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని నిన్న జగన్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ విషయం పై స్పంధించిన టీజీ కార్పొరేషన్ ఏర్పాటుకు చంద్రబాబు ఏడాది క్రితమే సుముఖత వ్యక్తం చేశారని పెర్కొన్నారు. జగన్ కేవలం అధికారం కోసం నోటికొచ్చినట్లు ప్రభుత్వం పై దాడి చేస్తున్నారని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు.
అదేవిధంగా జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ద్యజమెత్తారు. పులివెందుల రక్తచరిత్రను ఆయన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. జగన్ జనం మధ్య ఉండాల్సిన వ్యక్తి కాదని, ఆయనను జనజీవన స్రవంతికి దూరంగా ఉంచాలని కేశవ్ అన్నారు.జగన్ అధికారం కోసం తండ్రిని, తల్లిని, చెల్లిని కూడా వదులుకోగల వ్యక్తి జగన్ అని విమర్శించారు. జైల్లో 16 నెలలు గడిపి వచ్చినా జగన్ లో పరివర్తన రాలేదని ఆయన అన్నారు.
టిపిడి నాయకురాలు పంచుమర్తి అనురాధ కూడా జగన్ పై విరుచుకుపడ్డారు. రాయలసీమలో అనేక మందిని చంపిన... నీచమైన చరిత్ర జగన్ కుటుంబానికి ఉందని విమర్శించారు. జగన్ ముఠా కాలకేయుల ముఠాను మించిపోయిందన్నారు.
వర్ల రామయ్య కూడా జగన్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బెజవాడ బ్లేడు బ్యాచ్‌కి, జగన్ బ్యాచ్‌కి తేడా లేదని విమర్శించారు.
