లూటీ కోసం జగన్ అప్పులు .. విష వలయంలోకి ఏపీ , క్రెడిట్ సంస్థల నివేదిక ఇదే : యనమల రామకృష్ణుడు
జగన్ రెడ్డి ప్రభుత్వం లూటీ కోసం మితిమీరిన అప్పులు చేసి రాష్ట్రాల విష వలయంలోకి నెట్టిందని ఆరోపించారు టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. చేబదుళ్లు , ఓవర్ డ్రాప్ట్‌లతోనే ఆర్ధిక నిర్వాహణ చేసే స్థితికి ప్రభుత్వం దిగజారిందని చెప్పిందని రామకృష్ణుడు దుయ్యబట్టారు.

జగన్ రెడ్డి ప్రభుత్వం లూటీ కోసం మితిమీరిన అప్పులు చేసి రాష్ట్రాల విష వలయంలోకి నెట్టిందని ఆరోపించారు టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆగష్టు నెలలో డాయిష్ బ్యాంకు ముఖ్య ఆర్ధికవేత్త కౌశిక్ దాస్ తన నివేదికలో రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థల్లో ఏపీ 8వ స్థానం నుంచి 11 వ స్థానానికి పడిపోయిందని చెప్పినట్లు గుర్తుచేశారు. నిన్న క్రిసిల్ రేటింగ్ సంస్థ అమరావతి బాండ్ల రేటింగ్‌ను తగ్గించిందని యనమల తెలిపారు. చేబదుళ్లు , ఓవర్ డ్రాప్ట్‌లతోనే ఆర్ధిక నిర్వాహణ చేసే స్థితికి ప్రభుత్వం దిగజారిందని చెప్పిందని రామకృష్ణుడు దుయ్యబట్టారు.
వైసీపీ ప్రభుత్వం వెల్లడిస్తున్న కుట్రపూరిత గణాంకాలను రాష్ట్రం ఆవిర్భవించాక ఎన్నడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. 2019-20లో వృద్దిరేటు ఎక్కువగా చూపించుకోవడం కోసం టీడీపీ హయాంలో సాధించిన వృద్ధిరేటును తారుమారు చేశారని యనమల మండిపడ్డారు. 2018-19లో టీడీపీ సాధించిన జీడీపీ కన్నా 2019-20లో రూ.53,718 కోట్లు తగ్గించి 11.02 శాతం వృద్దిరేటును 5.36 శాతంకు కుదించారని ఆయన దుయయబట్టారు.
ALso Read: Kanna Lakshminarayana : ఏపీకి జగన్ అవసరం లేదు.. దానికి 100 కారణాలు చెబుతాం - కన్నా లక్ష్మీనారాయణ
వడ్డీల చెల్లింపుల కోసం ఛార్జీలు, పన్నుల బాధుడు, సబ్ ప్లాన్ నిధుల దారిమళ్లింపుతో సామాజిక న్యాయం గొంతు కోస్తున్నారని రామకృష్ణుడు గుర్తుచేశారు. ధరలు, ఛార్జీల బాదుడు వల్ల ఒక్కో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబంపై రూ.2,79,136 అదనపు భారం మోపారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.1.14 లక్షల కోట్లు సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించారని యనమల ఆరోపించారు. తప్పుడు లెక్కలపై, రాష్ట్ర ఆర్ధికస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి బహిరంగ చర్చకు రావాలని పిలిచినా వైసీపీ నుంచి ఎటువంటి స్పందన లేదని రామకృష్ణుడు ఫైర్ అయ్యారు.