నాడు నంద్యాలలో జగన్ మాట్లాడినట్టుగా నేడు మేం మాట్లాడొచ్చా: వర్ల రామయ్య
రెండేళ్లలో ఏపీని ఏమీ అభివృద్ధి చేశారని ఉప ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని టీడీపీ నేత వర్లరామయ్య ప్రశ్నించారు.
అమరావతి: రెండేళ్లలో ఏపీని ఏమీ అభివృద్ధి చేశారని ఉప ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని టీడీపీ నేత వర్లరామయ్య ప్రశ్నించారు.
సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో నంద్యాల ఎన్నికల్లో చంద్రబాబును రాళ్లతో కొట్టండని జగన్ అన్న మాటలను ఆయన గుర్తు చేశారు.తిరుపతి ఉప ఎన్నికల్లో మీ గురించి అదేస్థాయిలో మాట్లాడొచ్చా అని ఆయన ప్రశ్నించారు. మీరు ఎన్ని పరిశ్రమలు తెచ్చారని ఓటు అడుగుతున్నారని ఆయన అడిగారు.
ఈ నెల 17వ తేదీన తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ గురుమూర్తి పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్ధిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ పోటీలో ఉన్నారు.బీజేపీ జనసేన కూటమి అభ్యర్ధిగా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రత్నప్రభ పోటీలో ఉన్నారు.ఈ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ తమ శక్తివంచన లేకుండా పోటీ చేస్తున్నాయి.