Asianet News TeluguAsianet News Telugu

క్యాసినో వివాదం... గుడివాడలోనే మంత్రి నానితో తేల్చుకుంటా...: టిడిపి అనిత హెచ్చరిక

ఆఫర్లు పెట్టిమరీ గుడివాడలో క్యాసినో నిర్వహించి ఇఫ్పుడు తనకు ఎలాంటి సంబంధం లేదని అంటే నమ్మడానికి ప్రజలేమీ అమాయకులు కాదంటూ మంత్రి కొడాలి నానిపై టిడిపి మహిళా నాయకురాలు అనిత మండిపడ్డారు.

tdp leader vangalapudi anitha satires on minister kodali nani
Author
Bezawada, First Published Jan 24, 2022, 4:35 PM IST

విశాఖపట్నం: సంక్రాంతి పండగ (sankranti festival) సందర్భంగా గుడివాడ (gudiwada)లో సాంప్రదాయ వేడుకల పేరిట క్యాసినో (casino) నిర్వహించారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మంత్రి కొడాలి నాని (kodali nani)కి చెందిన ఫంక్షన్ హాల్ లో చీర్ గాళ్స్ డ్యాన్సుల మధ్య క్యాసినో (తీన్ పత్తి ప్లేయింగ్, అందర్ బాహర్,  రోలెట్ రన్నింగ్) జరిగినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా వీటితో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు మంత్రి నాని. తనకు సంబంధం వున్నట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేయడమే కాదు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ మంత్రి నాని ఛాలెంజ్ చేసారు. ఈ ఛాలెంజ్ పై టిడిపి నాయకులు స్పందిస్తూ ఆధారాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.  

ఈ క్రమంలోనే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత (vangalapudi anitha) మంత్రి కొడాలి నానిపై సీరియస్ అయ్యారు. ఎక్కడో కాదు నేరుగా గుడివాడకే వెళ్లి కొడాలి నానితో తేల్చుకుంటామని అనిత హెచ్చరించారు. 

Video

''ఏపీని అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా చేస్తామని సూపర్ సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చారు. ఆయన అన్నట్లుగానే క్రైమ్ రంగంలో ఏపీ నెంబర్ వన్ లో వుంది. గంజాయి, డ్రగ్స్ వంటి నిషేదిత మాధకద్రవ్యాలకు కేరాఫ్ అడ్రస్ గా ఏపీ మారింది. ఇలా ఇప్పటికే రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన సీఎం తాజాగా క్యాసినో కూడా రాష్ట్రానికి తీసుకువచ్చారు'' అంటూ వంగలపూడి ఎద్దేవా చేసారు. 

''ఒక్కప్పుడు ఏపీ అంటే పోర్టులు, పరిశ్రమలు గుర్తుకువచ్చేవి. కానీ ఇప్పుడు ఏపీ పెరు చెప్పగానే గుడివాడ గుర్తుకు వస్తుంది. అక్కడ క్యాసినో ఏర్పాటుచేసి డర్టీ కల్చర్ ను తీసుకొని వచ్చారు. ప్రజలకు వినోదాన్ని ఇస్తున్నామని అంటున్నారు... పవిత్రమైన పండుగ సంక్రాంతి రోజున అమ్మాయితల అశ్లీల నృత్యాలు, జూదమేనా వినోదమంటే?'' అని నిలదీసారు. 

''టిడిపి చీఫ్, మాజీ సీఎం చంద్రబాబును మంత్రి నాని అమ్మానా బూతులు తిడుతున్నారు. అంతేగానీ తాము ఆధారాలతో సహా ఆయన ఫంక్షన్ హాల్ లోనే క్యాసినో నిర్వహించినట్లు నిరూపిస్తున్నా మాటపై నిలబడటం లేదు. మీ కన్వెన్షన్ లోనే క్యాసినో జరిగిందిగా ది గ్రేట్ కొడాలి నాని... ఈ పెద్ద మనిషి పెట్రోల్ కొంటారా లేదా మేము పంపించాలా?'' అని ఎద్దేవా చేసారు. 

''అందరికీ సంక్రాంతి పండగ ముందుగానే రకరకాలుగా బంపర్ ఆఫర్స్ ఇచ్చారు. ఇప్పుడు నాకు ఏం తెలీదు అంటున్నారు.మీ మాటలు నమ్మేందుకు ప్రజలు అమాయకులేం కాదు. అమ్మాయిలతో డాన్స్ కార్యక్రమం జరిగిందని స్వయంగా మంత్రే చెప్పారు. దీనిపై పోలీసులు ఎందుకు పిర్యాదు చేయలేదు'' అని అనిత నిలదీసారు.

''అసలు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా? సీఎం జగన్ మీద ఎవరైనా పోస్ట్ పెడితే వారిపై చర్యలు తీసుకుంటున్న పోలీసులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు? గుడివాడ క్యాసినో వీడియో దేశం మొత్తం చూసింది. అనుమతులు లేకుండా ఎలా పెట్టారు... దీంతో ఎవరికి సంబంధం వుందో చెప్పాలి. ఇప్పటివరకూ ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు... ఎందుకు? పోలీసుల వాటా ఎంత? ఇందులో రూ.300 కోట్లు చేతులు మారలేదా?'' అని ప్రశ్నించారు.

''నువ్వు ఓ మంత్రివి... స్థానిక ప్రజాప్రతినిధివి... అలాంటిది నీ నియోజకవర్గంలో క్యాసినో జరిగితే ఎలా సంబందం లేదు అంటావ్? దీనిపై ఇంత రచ్చ జరుగుతున్నా సీఎం జగన్ ఎందుకు మౌనంగా వున్నారు. ఆయనకూ ఇందులో వాటా అందిందా...?'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

''గోవా కల్చర్ ని ఏపీకి తీసుకోని వచ్చారు. పేదవాడికి వినోదం అందించాలన్న దృఢ సంకల్పంతో ఉన్న సీఎం క్యాసినో కూడా అందించాలని అనుకున్నారా? ఆడవాళ్లతో డ్యాన్స్ లు చేయిస్తున్నారు... ఇత జరుగుతుంటే మహిళా హోమ్ మంత్రి ఏమి చేస్తున్నారు'' అని అడిగారు.

''గతంలో బీచ్ లో బీకినీ ఫెస్టివల్ తీసుకోని వస్తారా అన్న జగన్ ఇప్పుడు ఏమి చేస్తున్నారు? క్యాసినో, డ్యాన్స్ లు చూసి మీరు ఆనంద పెడతారా? చంద్రబాబు ఇంట్లో మనుషుల గురించి కొడాలి నాని మాట్లాడుతారా..? మాకు నీలాగా మాట్లాడటం రాదు. విలువలు అడ్డొస్తాయి'' అని వంగలపూడి అనిత అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios