అమరావతి: ఎపి డిజిపి గౌతం సవాంగ్ ను  కలవాలంటే హిందువులు నుదుటిపై బొట్టును చెరుపుకోవలసి వస్తున్నదన్న శివస్వామి  ఆరోపణలపై విచారణ జరపాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ బి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం శివక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఓ టివి ఛానల్లో మాట్లాడుతూ ఇటీవల డిజిపిని కలవడానికి వెళ్ళినప్పుడు ఈ విషయం అక్కడి కానిస్టేబుళ్లు చెప్పారని వెల్లడించినట్లు సుధాకర్ పేర్కొన్నారు.  

డిజిపి కార్యాలయంలయంలో 90 శాతం హిందూయేతరులే వున్నారని,  హిందువులు నుదుటి మీద బొట్టు పెట్టుకుని వెళ్ళితే  అపాయింట్ మెంట్ దొరకదని కానిస్టేబుల్ తెలిపారని స్వామి చెప్పారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్, హోమ్ శాఖా మంత్రి,  డిజిపి  ఒకే మతానికి చెందిన వారైనందున ఈ పరిస్థితి వచ్చిందని సాధారణ ప్రజలు కూడా ఆరోపిస్తున్నారని సుధాకర్ అన్నారు. 

వీడియో

 హిందూ ఆలయాలు, విగ్రహాలపై అనేక దాడులు జరుగుతున్నా ప్రభుత్వం, పోలీసులు పట్టించు కోవడం లేదన్న విమర్శలు ఉన్నాయన్నారు. శివస్వామి ఆరోపణలపై ట్విట్టర్లో పోస్టింగ్ పెద్దినందుకు చిత్తూరు జిల్లా ధర్మ జాగరణ సమితి అధ్యక్షుడు ఎం. సతీష్ రెడ్డి పెనుమూరు పోలీసులు బెదిరిస్తున్నారు. ఆయనపై కేసులు పెట్టి వేధించే  ప్రమాదం ఉందన్నారు. ఈ నేపధ్యంలో  దీనిపై సమగ్ర  విచారణ జరిపి  తగిన చర్యలు తీసుకోవాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.