అనంతపురం: ఓ వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడిపై దిశ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. డి. హీరేహాళ్ మండలం దొడగట్టకు చెందిన టీడీపీ నాయకుడు శ్రీనివాసులుపై రౌడీ షీట్ ఉంది. ఓ హత్య కేసులో ఏడేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించాడు. 

శ్రీనివాసులు గ్రామంోలని ఓ వివాహితపై కన్నేశాడు. ఏ విధంగానైనా ఆమెను లోబరుచుకోవాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. బుధవారం రాత్రి భర్తతో కలిసి నిద్రిసతు్న ఆమెపైకి శ్రీనివాసులు రాళ్లు విసిరి వెకిలి చేష్టలు చేశాడు. 

వెంటనే ఆమె ఆ సంఘటన గురించి భర్తకు చెప్పింది. అతను ఎవరక్కడ అని అరవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గురువారం బాధితురాలు తన భర్తతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

దాంతో శ్రీనివాసులపై క్రైమ్ నెంబర్ 358లోని 534డి, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాసులును రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ వలిబాషా తెలిపారు.