తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు రోజులే సమయం ఉంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ ఇతర పార్టీలన్నీ.. ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. అయితే.. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్, వైసీపీ అధినేత జగన్ కూడా పోటీచేస్తారని అందరూ ముందుగా భావించారు. అయితే.. వారు ఈ ఎన్నికలకు దూరంగా  ఉండిపోయారు. కేవలం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైనే తమ దృష్టి అంతా పెట్టారు.

అయితే.. .జగన్, పవన్ ఈ ఎన్నికల్లో పోటీచేయకపోవడానికి గల కారణం ఇదే అంటున్నారు టీడీపీ నేత, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు. మంగళవారం ఆయన మాడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఆస్తులను కాపాడుకునేందుకే.. జగన్,పవన్ లు తెలంగాణ ఎన్నికల్లో పోటీచేయలేదని విమర్శించారు. జగన్, పవన్ లకు దమ్ముంటే.. నారా లోకేష్ లాగా ఆస్తులు బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.