పట్టాభి (pattabhi) అరెస్ట్ విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారంటూ హైకోర్టు (ap high court) ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ (tdp) సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (somireddy chandra mohan reddy) స్పందించారు.
పట్టాభి (pattabhi) అరెస్ట్ విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారంటూ హైకోర్టు (ap high court) ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ (tdp) సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (somireddy chandra mohan reddy) స్పందించారు. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో డీజీపీ (ap dgp) ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుందని ఆయన హితవు పలికారు. పోలీసు శాఖపై హైకోర్టు నమ్మకం కోల్పోయిందన్న దానికి తాజా వ్యాఖ్యలే నిదర్శనమని సోమిరెడ్డి పేర్కొన్నారు. సీఎంకో న్యాయం, హైకోర్టు న్యాయమూర్తులకు మరో న్యాయమా? అంటూ కోర్టు ప్రస్తావించిందని చంద్రమోహన్ రెడ్డి గుర్తుచేశారు. కోర్టు తీవ్ర అభిశంసన చేసినా కూడా డీజీపీ స్పందించకపోవడం సరికాదని, పోలీసు విభాగం ప్రతిష్ఠకు ఇది మాయనిమచ్చ అని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. సీఎంపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే స్పందించి అరెస్ట్ చేసిన పోలీసులు, రాజ్యాంగబద్ధ పోస్టుల్లో ఉన్నవారిపై దూషణల విషయంలో ఎందుకు రియాక్ట్ కాలేదని హైకోర్టు ప్రశ్నించడం తెలిసిందే.
అంతకుముందు అక్టోబర్ 22న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో హింస పేట్రేగిపోయిందని, పోలీసుల సహాయంతో ప్రభుత్వమే ప్రజలపై దాడి చేస్తోందన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను అరికట్టండని కోరినందుకు ప్రజలే బలవుతున్నారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. గంజాయి, మాదక ద్రవ్యాలను గురించి ప్రశ్నిస్తే, విమర్శిస్తే పోలీసులు వారిని లోపలేస్తున్నారని ఆరోపించారు. పోలీసు సంస్మరణ సభలో ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddy మాట్లాడిన మాటలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని అన్నారు.
డీజీపీ, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రే తనను తిట్టారని, ఏం చేస్తారో చేయండని అంటే ఎలా? అని చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నింనచారు ఆయనే మావోయిస్టులు, నక్సలైట్లు మాట్లాడినట్టు మాట్లాడారని సోమిరెడ్డి విమర్శించారు. ప్రజలపై హింసను పోలీసులే ప్రోత్సహిస్తుంటే, ఇక సామాన్యులకు రాష్ట్రంలో దిక్కెవరు? అని ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయపై దాడి చేసింది వీరు అని చెప్పినా పోలీసులు వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు. సీఎం జగనే వారిని అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశిస్తున్నారా? అని సోమిరెడ్డి అడిగారు.
ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేత.. కానీ, ఆయనే నిన్న మాట్లాడుతూ, తనను తిట్టారు కాబట్టి కొట్టండి... చంపండి అనేలా మాట్లాడమేంటని అడిగారు. అందుకే పరిస్థితి ఇంతలా దిగజారిందని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగితే నిందితులను అరెస్టు చేయకుండా.. రక్షణ కల్పించాలని కోరిన టీడీపీ నేతలపైనే తప్పుడు కేసులు పెట్టారని సోమిరెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతలు పట్టాభిరామ్, నాదెండ్ల బ్రహ్మంలను అరెస్ట్ చేసిన పోలీసులు, టీడీపీ కార్యాలయంపై దాడి చేసినవారి జోలికి మాత్రం పోవడం లేదన్నారు.
