వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె తిరుమల శ్రీవారి బంగారంపై వైసీపీ రాజకీయాలు చేయడం దారుణమన్నారు.

చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంను పావుగా చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడై ఉండి సభ్యత లేకుండా మాట్లాడటం దారుణమన్నారు.

భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని యామిని విమర్శించారు. ఎన్నికల సంఘం చేతిలో సీఎస్ పావుగా మారారని... పసుపు-కుంకుమ డబ్బు మహిళలు అందకుండా ఎల్వీ సుబ్రమణ్యం కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సంక్షేమ పథకాలను అడ్డుకుంటే ప్రజలే తరిమి కొడతారని యామిని పేర్కొన్నారు.