Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా నాగవరప్పాడులో ఇళ్ల తొలగింపు: మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అరెస్ట్, ఉద్రిక్తత

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని  గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో  ఇళ్ల తొలగింపు కార్యక్రమాన్ని అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే  రావి వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్ట్  చేశారు. ఇవాళ ఆయనను  మేజిస్ట్రేట్ ముందు హజరుపర్చనున్నారు. 

Tdp Leader  Raavi Venkateswara Rao Arrested  For  obstructed house demolition in Krishna district
Author
First Published Feb 7, 2023, 11:25 AM IST

విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని  నాగవరప్పాడులో ఇళ్ల తొలగింపు  కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. గుడివాడ నియోజకవర్గంలో  నాగవరప్పాడులో  ఇళ్ల తొలగింపు కార్యక్రమాన్ని  గుడివాడ మాజీ ఎమ్మెల్యే  రావి వెంకటేశ్వరరావు  అడ్డుకున్నారు.. దీంతో  మాజీ ఎమ్మెల్యే  రావి వెంకటేశ్వరరావును   నిన్న  పోలీసులు  అరెస్ట్  చేశారు. పమిడిముక్కల పోలీస్ స్టేషన్ లో  ఉంచారు.ఈ పోలీస్ స్టేషన్ కు నిన్న రాత్రి పెద్ద ఎత్తున  టీడీపీ కార్యకర్తులు చేరుకున్నారు. రావి వెంకటేశ్వరరావును  వదిలిపెట్టాలని డిమాండ్  చేశారు.    ఇవాళ  ఉదయం  పమిడిముక్కల  పోలీస్ స్టేషన్  నుండి  గుడివాడ ఆసుపత్రికి  రావి వెంకటేశ్వరరావును పోలీసులు తీసుకు వచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత రావి వెంకటేశ్వరరావును మేజిస్ట్రేట్  ముందు  పోలీసులు హజరుపర్చనున్నారు.

రావివెంకటేశ్వరరావును  గుడివాడ ఏరియా ఆసుపత్రికి  తరించిన విషయం తెలుసుకున్న టీడీపా కార్యకర్తలు పెద్ద ఎత్తున గుడివాడ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఓపి చిటీ ఉన్న వారిని మాత్రమే హాస్పటల్ లోకి అనుమతిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios