ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత పరిటాల శ్రీరామ్ తీవ్ర విమర్శలు చేశారు. కేతిరెడ్డికి వందల ఎకరాలు భూములు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత పరిటాల శ్రీరామ్ తీవ్ర విమర్శలు చేశారు. కేతిరెడ్డికి వందల ఎకరాలు భూములు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. పరిటాల శ్రీరామ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. కేతిరెడ్డి ఎమ్మెల్యే అయ్యాక భూముల దొంగగా మారాడని విమర్శించారు. 10 ఎకరాల భూమి ఉన్న కేతిరెడ్డికి వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 25 ఎకరాలు కొన్నానని కేతిరెడ్డి చెబుతున్నారని.. కాంట్రాక్టర్ లేవు, పెద్దగా బిజినెస్‌లు కూడా లేవని.. గుడ్ మార్నింగ్ తప్ప వేరే వ్యాపార వ్యవహారాలు లేవని.. ఇలాంటి వ్యక్తికి ధర్మవరం చుట్టుపక్కల 100 ఎకరాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కొంచెం ఆలోచిస్తే కామన్ మ్యాన్‌కు కూడా అర్థం అవుతుందని అన్నారు. కేతిరెడ్డి తన బినామీ పేర్ల మీద ఆస్తులు కూడబెడుతున్నారని ఆరోపించారు.
కేతిరెడ్డి కథలు అందరికి తెలుసునని అన్నారు. టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత కేతిరెడ్డి అక్రమాలపై సిట్ విచారణ వేయిస్తామని చెప్పుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేల చేతుల్లో ఉద్యోగులు ఇరుక్కుపోతున్నారని అన్నారు. ధర్మవరం నుంచి అక్రమంగా మట్టి, ఇసుక తరలిస్తున్నారని విమర్శించారు. టీడీపీతో పెట్టుకోవద్దని.. కేతిరెడ్డి చరిత్ర బయటపెడతామని హెచ్చరించారు.
