Asianet News TeluguAsianet News Telugu

కోర్టు చేతిలో 55 సార్లు చీవాట్లు.. ఐనా మాదే పైచేయి అంటారు: వైసీపీపై పంచుమర్తి ఫైర్

వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. గురువారం ట్వీట్టర్ ద్వారా స్పందించిన ఆమె.. వైసీపీ నేతలు  కిందపడినా మాదే పైచేయి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
tdp leader panchumarthi anuradha fires on ysrcp over ap high court slashes go regarding english medium
Author
Amaravathi, First Published Apr 16, 2020, 4:28 PM IST
వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. గురువారం ట్వీట్టర్ ద్వారా స్పందించిన ఆమె.. వైసీపీ నేతలు  కిందపడినా మాదే పైచేయి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఏడాదిలో 55 సార్లు కోర్టులు చివాట్లు పెట్టినా వైసీపీ, మూర్ఖపు ఆలోచనల్లో మార్పు రావడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం ప్రారంభించింది చంద్రబాబు గారి హాయంలోనేనని అనూరాధ గుర్తుచేశారు.

తెలుగు లేదా ఇంగ్లీష్ మీడియంలో విద్యను ఎంచుకునే అవకాశం పిల్లలకు, తల్లిదండ్రులకు కల్పించింది తెలుగు దేశం ప్రభుత్వమేనని పంచుమర్తి గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వం ఈ విధంగా ఆప్షన్ ఇచ్చినా ఆనాడు వైసీపీ నాయకుల చిల్లర రాజకీయం, సాక్షి తప్పుడు రాతలు అందరూ చూశారని వ్యాఖ్యానించారు.

మాతృ భాషకు మంగళం,ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ మీడియమా అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారని పంచుమర్తి గుర్తుచేశారు. ఇంగ్లీష్ నేర్పొద్దు అని ఏ రాజకీయ పార్టీ చెప్పలేదని.. తల్లిదండ్రులకు, పిల్లలకు ఆప్షన్ ఇవ్వాలని కోర్టు చెప్పిందని అనూరాధ చెప్పారు.

పూసగుచ్చినట్టు కోర్టులో అన్ని విషయాలు బయటపడిన తరువాత కూడా ఇంగ్లీష్ నేర్పొద్దు అంటారా అని నటించడం వైకాపా నాయకులకే చెల్లిందని పంచుమర్తి అనూరాధ సెటైర్లు వేశారు.

కాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు వైఎస్ జగన్ తీసుకొచ్చిన జీవో 81, 85ను కొట్టివేస్తూ ఉన్నత న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. 

 
Follow Us:
Download App:
  • android
  • ios